Sunday, November 27, 2022
More
    Homeసినిమాఓటీటీ యాప్ రెడీ : నమిత

    ఓటీటీ యాప్ రెడీ : నమిత

    నమిత ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. ఆమె చేయడం లేదు అనే కంటే, ఆమెకు ఎవ్వరూ అవకాశం ఇవ్వడం లేదని చెప్పడం కరెక్ట్. ఆమధ్య 2 సినిమాలు చేస్తూ, రెండూ మార్కెట్ అవ్వక ఆగిపోయాయి.ప్రస్తుతం నమిత రేంజ్ ఇది. దీంతో ఆమెకు అవకాశాలిచ్చేవాళ్లు కరువయ్యారు.

    అటు నమిత కూడా అవకాశాల కోసం ఎదురుచూడ్డం లేదు. పెళ్లి చేసుకొని సెటిలైన ఈ ముద్దుగుమ్మ,పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాలని చూస్తోంది. అలా అని కోలీవుడ్ నుంచి దూరంగా జరగాలని కూడా ఈమెకు లేదు. అందుకే బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకుంది నమిత.

    కొత్త ఓటీటీ యాప్ ను స్థాపించింది నమిత. దీని పేరు నమిత థియేటర్. ఈ యాప్ లో చిన్న నిర్మాతలు,కొత్త దర్శకులకు చోటిస్తానని చెబుతోంది. ఎవరైనా మంచి కంటెంట్ తో వస్తే, దాన్ని తన యాప్ లో పెట్టుకోవచ్చని చెబుతోంది. దీనికి ఆమె ఓ సరికొత్త బిజినెస్ మోడల్ తెరపైకి తీసుకొచ్చింది. నమిత ప్రారంభించిన ఈ కొత్త వ్యాపారం ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page