రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ప్ర‌భాస్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయ‌న కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా ఇమేజ్ అందిపుచ్చుకున్నాడు. బాహుబ‌లి చిత్రం ప్ర‌భాస్ ఇమేజ్‌ని ప‌దింత‌లు చేసింది అని చెప్పాలి. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్‌కి ఆ రేంజ్ హిట్ రాలేదు కాని వ‌చ్చి ఉంటే మాత్రం ఆయ‌న ఇమేజ్ ఓ రేంజ్‌లో పెరిగి ఉండేది. సాహో ఓ మోస్తరు విజయం అందుకోగా, ఈ చిత్రం హిందీలో రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాధే శ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్స్ అయ్యాయి. కాగా డిసెంబర్ 22న విడుదల కానున్నస‌లార్ చిత్రంపైనే అంద‌రి దృష్టి ఉంది. ఈ సినిమాతో ప్ర‌బాస్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు.

అయితే ప్ర‌స్తుతం ప్ర‌భాస్.. మ‌హాన‌టి చిత్ర ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో కల్కి 2898 AD అనే చిత్రం చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ అంశాలతో సైన్స్ ఫిక్షన్ మూవీగా చిత్రం రూపొందుతుండ‌గా, వచ్చే ఏడాది కల్కి విడుదల కానుంది. మ‌రోవైపు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీగా రూపొంద‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే మూవీ కూడా చేయ‌నున్నాడు. ఇక స‌లార్ కి సీక్వెల్‌గా ఓ చిత్రం, సీతారామం డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడితో ఓ చిత్రం ప్ర‌భాస్ ఖాతాలో ఉన్నాయి.

హ‌ను రాఘ‌వ‌పూడి- ప్ర‌భాస్ కాంబోలో రూపొంద‌నున్న చిత్రం వరల్డ్ వార్ 2 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించున్నార‌ని చెబుతున్నారు. ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందించ‌నున్న‌ట్టు నెట్టింట ఓ వార్త చక్క‌ర్లు కొడుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌మిట్ అయిన ప్రాజెక్ట్స్ అన్ని పూర్త‌య్యాక హ‌ను రాఘ‌వ‌పూడి మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నార‌ని స‌మాచారం. ఇటీవల ప్రభాస్ కి మోకాలి సర్జరీ కాగా, ఆయన నెల రోజులకు పైగా విదేశాల్లో రెస్ట్ తీసుకుకొని రీసెంట్‌గానే ఇండియాకి వ‌చ్చారు. ఇప్పుడు త‌ను క‌మిటైన చిత్రాల షూటింగ్ పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు.

Updated On 20 Nov 2023 10:21 AM GMT
sn

sn

Next Story