ప్ర‌స్తుతం థియేట‌ర్‌లో స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతున్న సూప‌ర్ హిట్ చిత్రం మంగ‌ళ‌వారం. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొంద‌గా, స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 17వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చారు.హైపర్ సెక్సువల్ డిజార్డర్ అనే టిపికల్ పాయింట్‌తో ఫన్, ఎమోషనల్ అంశాలని జోడించి సినిమాని రూపొందించారు. మూవీకి తొలి ఆట నుండే మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన పాయ‌ల్‌పై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా కురిపిస్తున్నారు. ఆదివారం ప్రపంచకప్ ఫైనల్ వల్ల వసూళ్లపై కాస్త ప్ర‌భావం ప‌డింది.అయితే కలెక్ష‌న్స్ మంచిగానే రాబ‌డుతున్న ఈ సినిమా రానున్న రోజుల‌లో ఓటీటీలోకి రానుండ‌గా, అప్పుడు కూడా ఈ మూవీ అద‌ర‌గొడుతుంద‌ని అంటున్నారు.

చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్ ప‌ర్‌ఫార్మెన్స్ ప‌రంగా అద‌ర‌గొట్టారు. ఇత‌ర హీరోయిన్స్ ఎవ‌రు ఒప్పుకోని పాత్ర‌లో చాలా క‌న్విన్సింగ్ ప‌ర్‌ఫార్మెన్స్ చూపించి అంద‌రిచేత శ‌భాష్ అనిపించుకుంది పాయ్‌. సినిమా చివ‌ర‌లో జమీందారు భార్య పాత్రలో నటించిన అమ్మాయికి మంచి పేరు వ‌చ్చింది. చివర్లో షాకింగ్ ట్విస్టు ఇచ్చే ఈ పాత్రలో నటించిన అమ్మాయి ఎవరనే చర్చ న‌డుస్తుండ‌గా, ఆ అమ్మాయి పేరు .. దివ్యా పిళ్లై. మలయాళ నటి అయిన ఈ భామ ఓటీటీలో సూపర్ హిట్ అయిన టొవినో థామస్ చిత్రం ‘కలా’లో ఆమె హీరో భార్యగా ముఖ్య పాత్ర పోషించింది. తమిళంలోనూ ఒకట్రెండు సినిమాల్లో నటించింది. తెలుగులో నవీన్ చంద్ర హీరోగా దండుపాళ్యం దర్శకుడు రూపొందించిన ‘తగ్గేదేలే’లో హీరోయిన్ పాత్ర చేసింది. అయితే మంగ‌ళ‌వారం చిత్రంతోనే ఈ అమ్మ‌డు హైలైట్ అయింది.

ఇక ఇదిలా ఉంటే చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన పాయ‌ల్‌కి ఈ సినిమాతో మంచి ఛాన్స్ వ‌చ్చింది. అయితే పాయ‌ల్ క‌న్నా ముందు ద‌ర్శ‌కుడు వేరే హీరోయిన్‌ని అనుకున్నార‌ట‌. ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు. సిద్దూ ప్రమ్ శ్రీకాకుళం, ఆర్య-2 వంటి సినిమాల్లో నటించి మెప్పించిన శ్ర‌ద్ధా దాస్.సినిమా కంటెంట్ బోల్డ్ నెస్ ఎక్కువ ఉందని ఆమె తిరస్కరించింది. అయితే పాయ‌ల్ కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నా కూడా సినిమాలో న‌టించేందుకు ఆస‌క్తి చూపింది. మొత్తానికి మంచి విజ‌యం సాధించి పాయ‌ల్ ఈజ్ బ్యాక్ అనేలా చేసింది.

Updated On 20 Nov 2023 11:53 AM GMT
sn

sn

Next Story