కష్టపడి సంపాదించిన డబ్బు చెదలపాల‌వ్వ‌డం కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. రాత్రి, ప‌గ‌ల‌న‌క శ్ర‌మించి సంపాదించిన డ‌బ్బుని ట్రంక్ పెట్టెలో దాచుకోగా, వాటికి చెద‌లు ప‌ట్టాయి. క‌రెన్సీ నోట్ల‌న్నీ కూడా చిత్తు కాగితాల్లా మార‌డంతో వారి ఆవేద‌న అంతా ఇంతా కాదు. ఇది చూసిన వారి హృద‌యాలు ద్ర‌వింప‌జేస్తున్నాయి.కూతురి పెళ్లి కోసమ‌ని ఆ పేద కుటుంబం రెండు లక్షల వరకు జమ చేసింది. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుకి చెదలు పట్టడంతో తాము పడ్డ కష్టమంతా ఇలా వృథా అయిపోయిందని ఆ కుటుంబం తల్లడిల్లిపోగా, అందుకు సంబంధించిన విజువ‌ల్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.ఇక ఇది చూసిన వారు త‌మవంతు సాయం అందిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ‘బేబీ’ సినిమాతో నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు కూడా ఆ కుటుంబానికి అండ‌గా నిలుస్తాన‌ని చెప్పి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు. పెళ్లికి దాచుకున్న డ‌బ్బు అంతా చెదలు ప‌ట్ట‌డంతో, దాదాపు రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌రాబ‌య్యాయి. అయితే ఎంత డ‌బ్బు అయితే ఖ‌రాబైందో అంత మొత్తాన్ని తాను సాయం చేస్తానంటూ ఎస్కేఎన్ ప్ర‌క‌టించారు. వారి స‌మాచారం త‌న‌కు అందించాల‌ని కూడా కోరాడు. ఎస్కేఎన్ మంచి మ‌న‌సుపై ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఇక ఈ ఘ‌ట‌న పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. ఓ పేద తండ్రి తన బిడ్డకోసం రూ.2 లక్షల వరకు కూడబెట్టుకోగా, ఆ సొమ్ము వినియోగించ‌డానికి వీలు లేకుండా అయిపోయింది.

వారి ఆవేద‌న‌ని అర్ధం చేసుకున్న ఎస్కేఎన్ తాను చేయ‌స్తాన‌ని ముందుకు రావ‌డం విశేషం. ఇక ఎస్కేఎన్ నిర్మించిన బేబి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త్వ‌ర‌లో ఆయ‌న న‌లుగురు యంగ్ డైరెక్టర్లతో సినిమాలు నిర్మిస్తున్నారు. ‘బేబీ’ ఇచ్చిన జోష్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌ని అనుకుంటున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసారి ఏకంగా నాలుగు సినిమాలు నిర్మిస్తున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించారు. మ‌రోసారి యంగ్ డైరెక్టర్ సాయి రాజేశ్ తో పాటు సందీప్ రాజ్. సుమన్ పాతూరి, రవి దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్స్ చేయ‌నున్న‌ట్టు ఎస్కేఎన్ తెలియ‌జేశాడు.

Updated On
sn

sn

Next Story