Srija: మెగా డాటర్ శ్రీజ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వకపోయిన ఫుల్ పాపులర్ అయింది. తనకు అంతలా పాపులర్ రావడానికి కారణం ఆమె రెండు పెళ్లిళ్లు పెటాకులు కావడమే. మొదటి పెళ్లి విషయంలో మెగా ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకు వచ్చేట్టు చేసిన శ్రీజ.. మీడియా ముందు వారి గురించి దారుణంగా మాట్లాడింది. అయితే ఫ్యామిలీకి ఇష్టం లేకపోయిన కూడా శిరీష్ భరద్వాజ్‌ని పెళ్లి చేసుకొని అతనితో కొన్నేళ్ల కాపురం చేసి నివృతికి జన్మనివ్వడం, పాప పుట్టాక అతనికి విడాకులు […]

Srija: మెగా డాటర్ శ్రీజ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వకపోయిన ఫుల్ పాపులర్ అయింది. తనకు అంతలా పాపులర్ రావడానికి కారణం ఆమె రెండు పెళ్లిళ్లు పెటాకులు కావడమే. మొదటి పెళ్లి విషయంలో మెగా ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకు వచ్చేట్టు చేసిన శ్రీజ.. మీడియా ముందు వారి గురించి దారుణంగా మాట్లాడింది. అయితే ఫ్యామిలీకి ఇష్టం లేకపోయిన కూడా శిరీష్ భరద్వాజ్‌ని పెళ్లి చేసుకొని అతనితో కొన్నేళ్ల కాపురం చేసి నివృతికి జన్మనివ్వడం, పాప పుట్టాక అతనికి విడాకులు ఇచ్చి మళ్లీ చిరంజీవి చెంతకి చేరడం జరిగింది. ఇక కొన్నాళ్లకి శ్రీజకి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో పెళ్లి చేయించారు మెగాస్టార్. వీరి వైవాహిక జీవితంలో నివిష్క అనే కూతురు జన్మించింది.
కొన్నాళ్లపాటు ఈ జంట చాలా బాగానే ఉన్నప్పటికీ ఇటీవల వారిద్దరు కూడా దూరంగా ఉంటున్నారు. వారి విడాకులు కూడా అయ్యాయి అని తెలుస్తుంది. కళ్యాణ్ దేవ్ నుండి విడిపోయాక కూతురిని తన దగ్గరే ఉంచుకుంటుంది శ్రీజ. వారానికి ఒక సారి కళ్యాణ్ దేవ్ దగ్గరకు పంపిస్తుంది. ఇక శ్రీజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు లేదంటే, ఏవో ఇంట్రెస్టింగ్ కొటేషన్స్ పెడుతూ హాట్ టాపిక్‌గా మారుతుంది . తాజాగా శ్రీజ చేసిన ఓ పోస్ట్ అందరిలోనూ అనేక అనుమానాలను పుట్టిస్తోంది. సంథింగ్ ఈజ్ కమింగ్ అంటూ శ్రీజ రాసుకు రావడంతో ఏం గుడ్ న్యూస్ చెప్పబోతుందా అని అందరు ఆలోచన చేస్తున్నారు.
తన పోస్టులో కింద స్వాతి నిమ్మగడ్డ అనే పేరుని కూడా ట్యాగ్ చేయడంతో ఆమెతో కలిసి ఏదైన వ్యాపారం చేయబోతుందా అంటూ, లేక ఈ ఇద్దరు కలిసి ఏదైన కొత్త విషయం చెప్పబోతున్నారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే శ్రీజ, సుస్మిత, నిహారికలు ఈ రాఖికి రామ్ చరణ్‌కు రాఖీలు కట్టగా, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి,
