విధాత:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప‌. ఎర్ర చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న పుష్ప రెండు పార్టులుగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. లాక్ డౌన్ తో టైం దొర‌క‌డంతో సుకుమార్ రెండో పార్టు స్క్రిప్ట్ ప‌నుల్లో బిజీగా ఉన్నార‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప్ర‌స్తుతానికి స్క్రిప్ట్ వ‌ర్క్ ఏం చేయడం లేద‌ట ఈ లెక్క‌ల మాస్టారు. పుష్ప పార్టు 1కు వ‌స్తున్న స్పంద‌న చూసి.. సెకండ్ పార్టులో మార్పులు […]

విధాత:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప‌. ఎర్ర చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న పుష్ప రెండు పార్టులుగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. లాక్ డౌన్ తో టైం దొర‌క‌డంతో సుకుమార్ రెండో పార్టు స్క్రిప్ట్ ప‌నుల్లో బిజీగా ఉన్నార‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప్ర‌స్తుతానికి స్క్రిప్ట్ వ‌ర్క్ ఏం చేయడం లేద‌ట ఈ లెక్క‌ల మాస్టారు. పుష్ప పార్టు 1కు వ‌స్తున్న స్పంద‌న చూసి.. సెకండ్ పార్టులో మార్పులు చేయాల‌ని భావిస్తున్నాడ‌ట సుకుమార్‌.

బాహుబలి సినిమా విష‌యంలో ఎస్ఎస్ రాజ‌మౌళి ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. ఇపుడు స‌కుమార్ కూడా పుష్ప అంశంలో ఇదే ప‌ద్ద‌తిని అనుస‌రించాల‌ని ఫిక్స్ అయిన‌ట్టు టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతానికైతే సుకుమార్ పుష్పను పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే దానిపైనే ఫోక‌స్ పెట్టిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే పుష్ప షూట్ రీస్టార్ట్ కానుంది.

Updated On 16 Jun 2021 4:41 AM GMT
subbareddy

subbareddy

Next Story