విధాత:తమిళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘సూరరై పోట్రు’ హిందీలో రీమేక్‌ కానుంది. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. సూర్య నిర్మాత కూడా. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’గా వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబరులో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలై వీక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అంతేకాదు.. 93వ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌ ఎంపిక బరిలో […]

విధాత:తమిళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘సూరరై పోట్రు’ హిందీలో రీమేక్‌ కానుంది. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. సూర్య నిర్మాత కూడా. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’గా వచ్చిన సంగతి తెలిసిందే.

గత ఏడాది నవంబరులో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలై వీక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అంతేకాదు.. 93వ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌ ఎంపిక బరిలో నిలిచింది. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు సూర్య వెల్లడించారు. బాలీవుడ్‌ నిర్మాత విక్రమ్‌ మల్హోత్రాతో కలిసి ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించనున్నారు సూర్య. మాతృతకు దర్శకత్వం వహించిన సుధా కొంగరయే హిందీ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించనున్నారు. హిందీలో నిర్మాతగా సూర్యకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అయితే ఈ రీమేక్‌లో ఎవరు హీరోగా నటిస్తారనేది తెలియాల్సి ఉంది.

Updated On 13 July 2021 4:32 AM GMT
Venkat

Venkat

Next Story