విడుదలకు ముందే ఆది కేశవ చిత్రం ప్రేక్షకులలో అంచనాలు పెంచడంతో పాటు వివాదాలకు సైతం గురవుతుంది.

విధాత : విడుదలకు ముందే ఆది కేశవ చిత్రం ప్రేక్షకులలో అంచనాలు పెంచడంతో పాటు వివాదాలకు సైతం గురవుతుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌లో మనిషి మంటల్లో కాలిపోతుంటే హీరో ఆ మంటల్లో సిగరేట్ వెలిగించుకుంటున్నసన్నివేశం విమర్శల పాలవుతుంది. పంజా వైష్ణవ్, శ్రీలీలలు నటించగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఆదికేశవ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


కాగా.. సినిమా విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్‌లో హింసాత్మక దృశ్యాల పాలు అతిగా ఉండటంపై ప్రేక్షకులు విమర్శలు సంధిస్తున్నారు. ట్రైలర్‌లో కనిపించిన మేరకు హీరో తన ప్రత్యర్థులను తుద ముట్టించే క్రమంలో ప్రత్యర్థి మంటల్లో కాలిపోతుంటే ఆ మంటల్లో హీరో సిగరేట్ వెలిగించుకుంటు కనిపిస్తాడు. ఈ సన్నివేశం మరీ హింసాత్మకంగా అమానవీయంగా అతిగా ఉందంటూ నెట్టింటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated On
Somu

Somu

Next Story