విధాత:స్మాల్ స్క్రీన్‌పై అలరించబోతోన్న పాపులర్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'. దీనికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్.హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాపులర్ షోకు ఫస్ట్ గెస్ట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రానున్నట్టు తెలుస్తోంది. […]

విధాత:స్మాల్ స్క్రీన్‌పై అలరించబోతోన్న పాపులర్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'. దీనికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్.హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాపులర్ షోకు ఫస్ట్ గెస్ట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రానున్నట్టు తెలుస్తోంది.

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మకమైన చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో చరణ్ - ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.'ఆర్ఆర్ఆర్' మొదలయ్యాక ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ కారణంగానే షోకు ఫస్ట్ గెస్ట్‌గా చరణ్‌ను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. ఇందులో వాస్తవం ఎంతనేది తెలియనప్పటికి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మాత్రం ఉత్సాహం రెట్టింపు అయింది. కాగా త్వరలో దీని ప్రోమోను రిలీజ్ చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated On 16 July 2021 4:34 AM GMT
Venkat

Venkat

Next Story