ఏడాదిలో 7 రాష్ట్రాల్లో ఆరు ఖరీదైన కార్లు కొట్టేసి సొమ్ము చేసుకున్న ఘరానా ఇంజనీరింగ్‌ దొంగ ఆటకట్టించారు సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు. అతని వద్ద నుంచి రూ.70లక్షల విలువైన ఆరు కార్లు, ఒక రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరికి జిల్లా భీమవరానికి చెందిన గుడాటి మహేష్‌ నూతన్‌ కుమార్‌ 2016లో ఈఈఈలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు […]

ఏడాదిలో 7 రాష్ట్రాల్లో ఆరు ఖరీదైన కార్లు కొట్టేసి సొమ్ము చేసుకున్న ఘరానా ఇంజనీరింగ్‌ దొంగ ఆటకట్టించారు సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు. అతని వద్ద నుంచి రూ.70లక్షల విలువైన ఆరు కార్లు, ఒక రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

పశ్చిమగోదావరికి జిల్లా భీమవరానికి చెందిన గుడాటి మహేష్‌ నూతన్‌ కుమార్‌ 2016లో ఈఈఈలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. మలక్‌పేటలో మొబైల్‌ టెక్నీషియన్‌గా చేరాడు. తాను పనిచేస్తున్న మొబైల్‌ షాఫును నకిలీ తాళంచెవులతో తెరిచి ఫోన్‌లు, ఇతర యాక్సెసెరీస్‌ చోరీ చేశాడు. యజమాని ఫిర్యాదుతో మలక్‌పేట పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు భీమవరం వెళ్లిపోయాడు. అక్కడ పాలకోడేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక ఖరీదైన కెమెరా చోరీ చేసి అక్కడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. 2018లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోసారి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఎస్‌ఆర్‌నగర్‌లో ఒక షేరింగ్‌ రూమ్‌లో అద్దెకు దిగాడు. కొద్దిరోజులు నమ్మకంగా ఉండి ఒక టాటాబోల్డ్‌ కారు, ల్యాప్‌టాప్‌, రూ. 25వేల నగదు చోరీ చేసి ఉడా యించాడు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు 2019 డిసెంబర్‌లో నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Updated On 10 April 2021 8:40 AM GMT
subbareddy

subbareddy

Next Story