విధాత‌(బెంగ‌ళూరు): ఇటీవ‌ల కాలంలో క‌రోనా బారిన ప‌డి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు క‌న్నుమూశారు. వారి మృతి సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అనే చెప్పాలి. లెజెండ్స్ మ‌ర‌ణంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌తో పాటు అభిమానులు దిగ్భ్రాంతికి గుర‌య్యారు. ఆ చేదు వార్త‌ల నుండి ఇంకా కోలుకోక ముందే ప్రముఖ కన్నడ నటుడు శంకనాడ అరవింద్ (70) క‌రోనాతో కన్నుమూశారు. క‌రోనాతో మ‌రో ప్ర‌ముఖ న‌టుడు మృతిగ‌త వారం రోజులుగా ఆయ‌న బెంగ‌ళూరులోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, శుక్రవారం […]

విధాత‌(బెంగ‌ళూరు): ఇటీవ‌ల కాలంలో క‌రోనా బారిన ప‌డి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు క‌న్నుమూశారు. వారి మృతి సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అనే చెప్పాలి. లెజెండ్స్ మ‌ర‌ణంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌తో పాటు అభిమానులు దిగ్భ్రాంతికి గుర‌య్యారు. ఆ చేదు వార్త‌ల నుండి ఇంకా కోలుకోక ముందే ప్రముఖ కన్నడ నటుడు శంకనాడ అరవింద్ (70) క‌రోనాతో కన్నుమూశారు.

క‌రోనాతో మ‌రో ప్ర‌ముఖ న‌టుడు మృతి
గ‌త వారం రోజులుగా ఆయ‌న బెంగ‌ళూరులోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా, శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కరోనాతో వారం రోజుల క్రితం బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కూతురు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మనసా హోల్లా తన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో అర‌వింద్ భార్య మృతి చెందడం, ఇప్పుడు అర‌వింద్ క‌రోనాతో మృతి చెంద‌డంతో ఆ ఫ్యామిలీ పుట్టెడు దుఃఖంలో ఉంది. ఇప్పటివరకు సుమారు 250 సినిమాల్లో న‌టించిన అర‌వింద్ సహాయక పాత్రల్లో తనదైన మార్కును చాటుకున్నారు.

Updated On 8 May 2021 5:57 AM GMT
subbareddy

subbareddy

Next Story