విధాత: జొమాటో డెలివ‌రీ మ్యాన్ ఓ అమ్మాయికి బ‌ల‌వంతంగా ముద్దు పెట్టాడు. ఆ త‌ర్వాత ఆమెతో వాట్సాప్‌లో చాట్ చేయ‌డం ప్రారంభించాడు. అత‌ని వేధింపులు తాళ‌లేక బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాష్ట్ర పుణెలోని యేవ‌లేవాడి ఏరియాకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని సెప్టెంబ‌ర్ 17వ తేదీ రాత్రి 9:30 గంట‌ల స‌మ‌యంలో జొమాటో యాప్‌లో ఫుడ్ ఆర్డ‌ర్ చేసింది. ఫుడ్ డెలివ‌రీ మ్యాన్‌.. ఆర్డ‌ర్ ఇంటికి తీసుకొచ్చాడు. తాగ‌డానికి మంచి నీళ్లు ఇవ్వ‌మ‌ని […]

విధాత: జొమాటో డెలివ‌రీ మ్యాన్ ఓ అమ్మాయికి బ‌ల‌వంతంగా ముద్దు పెట్టాడు. ఆ త‌ర్వాత ఆమెతో వాట్సాప్‌లో చాట్ చేయ‌డం ప్రారంభించాడు. అత‌ని వేధింపులు తాళ‌లేక బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాష్ట్ర పుణెలోని యేవ‌లేవాడి ఏరియాకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని సెప్టెంబ‌ర్ 17వ తేదీ రాత్రి 9:30 గంట‌ల స‌మ‌యంలో జొమాటో యాప్‌లో ఫుడ్ ఆర్డ‌ర్ చేసింది. ఫుడ్ డెలివ‌రీ మ్యాన్‌.. ఆర్డ‌ర్ ఇంటికి తీసుకొచ్చాడు.

తాగ‌డానికి మంచి నీళ్లు ఇవ్వ‌మ‌ని అడ‌గ‌డంతో ఆమె తెచ్చి ఇచ్చింది. ఇంట్లో ఎవ‌రూ లేరా? అని ప్ర‌శ్నించాడు. లేర‌ని చెప్ప‌డంతో.. మ‌రో గ్లాస్ వాటర్ తెమ్మ‌ని చెప్పాడు.

ఇక ఆమెను ఫాలో అయ్యి వెనుక నుంచి కౌగిలించుకునే ప్ర‌య‌త్నం చేసి, చెంప‌పై రెండుసార్లు ముద్దు పెట్టాడు. దీంతో విద్యార్థిని భ‌య‌ప‌డి.. దూరంగా వెళ్లింది. నీకు ఏమైనా స‌హాయం కావాలంటే ఫోన్ చేయ్ అని జొమాటో డెలివ‌రీ మ్యాన్ చెప్పి వెళ్లిపోయాడు.

ఆ త‌ర్వాత ఆమెతో వాట్సాప్‌లో చాట్ చేస్తూ వేధించాడు. అత‌ని వేధింపులు భ‌రించ‌లేని బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు 42 ఏండ్ల ఫుడ్ డెలివ‌రీ మ్యాన్‌ను అరెస్టు చేశారు.

Updated On 20 Sep 2022 7:52 AM GMT
subbareddy

subbareddy

Next Story