HomeLatest newsభువనగిరి: వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

భువనగిరి: వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

విధాత,యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వే నెంబర్ 797.798.621లో 4ఎకరాలు వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వక్ఫ్ ప్రొటెక్షన్ కమెటీ ఆఫీషియల్ మెంబర్ ఎండీ ఇంతియాజ్ తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈవో శానవాజ్ ఖాసీం ఐపీఎస్, తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీ ఉల్లాహ్ ఖాన్ మరియు డిప్యూటీ సూపరిండెంట్ అధికారి ఖాజా మొయినొద్దీన్ వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీం వక్ఫ్ బోర్డు ఓఎస్డీ ఎండీ అసదుల్లాఖాన్ వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్, మున్సిపల్ టీపీఎస్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పోలీసుల సహకారంతో అట్టి అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ఇట్టి భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే వక్ఫ్ బోర్డు యాక్ట్ 1995 ప్రకారం  కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారి పట్టా పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, నోటరీని కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఈ సందర్బంగా వక్ఫ్ బోర్డు ఓఎస్డీ,ఇన్‌స్పెక్టర్లు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమణకు గురైన వక్ఫ్ బోర్డు స్థలాలను గుర్తించి స్వాధీనం చేసుకుంటామని, సీబీఐ విచారణ జరిపిస్తామన్నారు. అలాగే కూల్చివేతకు సహకరించిన ఏసీపీ, సీఐలకు వారు ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో వక్ఫ్ ప్రొటెక్షన్ జిల్లా ఆఫీషియల్ మెంబర్ ఎండీ ఇంతియాజ్, వక్ఫ్ బోర్డు సర్వేయర్ సుజాయత్ అలీ, రెవెన్యూ సర్వేయర్ రజనీకాంత్, మండల రెవిన్యూ ఇన్‌స్పెక్టర్లు సైదా, భద్రయ్య మున్సిపల్ టీపీఎస్ నరేశ్‌, జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ కమెటీ లీగల్ అడ్వయిజర్,కో అప్షన్ మెంబర్ సయ్యద్ అహ్మద్ అఫ్జల్, పోలీసు సిబ్బంది,మరియు వక్ఫ్ ప్రొటెక్షన్ కమటీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ
ఇస్తియాక్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

తాజా వార్త‌లు

error: Content is protected !!