ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమ‌వారం ఉదయం 8 గంట‌ల‌కు శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం కనువిందు చేసింది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు. స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు కటాక్షించారు. అనంతరం ఉదయం 11 గంటలకు ఆలయంలో ఏకాంతంగా తిరుమంజనం వేడుకగా నిర్వహించ‌నున్నారు. ఇందులో పాలు, […]

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమ‌వారం ఉదయం 8 గంట‌ల‌కు శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం కనువిందు చేసింది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు కటాక్షించారు.

అనంతరం ఉదయం 11 గంటలకు ఆలయంలో ఏకాంతంగా తిరుమంజనం వేడుకగా నిర్వహించ‌నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవారికి వేడుకగా అభిషేకం చేయ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ ధ‌నంజ‌యులు, శ్రీఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated On 26 April 2021 4:52 AM GMT
subbareddy

subbareddy

Next Story