మేషం : ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆచితూకి అడుగు వేయాలి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. పనుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
వృషభం : ఈ రాశి వారికి కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. మీ మీ రంగాల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.
మిథునం : ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా బలపడుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. రామ నామ జపం శ్రేయోదాయకం.
కర్కాటకం : ఈ రాశి వారు చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆదిత్య హృదయం చదవాలి.
సింహం : ఈ రాశివారు మానసిక ఆనందాన్ని పొందుతారు.ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ అతిగా నమ్మకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
కన్య : ఈ రాశివారికి శారీరక శ్రమ పెరుగుతుంది. శ్రద్ధతో పని చేయాలి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. గురు నామస్మరణ శుభప్రదం.
తుల : ఈ రాశి వారికి బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది.
వృశ్చికం : ఈ రాశివారు కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివిగా ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి.
ధనుస్సు : ఈ రాశివారు విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
మకరం : ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి.
కుంభం : ఈ రాశివారికి ముఖ్య వ్యవహారాలలో అనుకున్నది దక్కుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి సహాయసహకారాలు అందుతాయి.
మీనం : ఈ రాశివారు సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వివాదాల్లో తలదూర్చకండి.