18-03-2023 శనివారం రాశి ఫలాలు.. ఈ రాశి వారికి స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి
మేష రాశి : శరీర బాధలు ఉపశమిస్తాయి. క్రీడాకారులకు శ్రమ ఎక్కువైనను విజయం సాధిస్తారు. ఇష్టమైన వ్యక్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల ఆదరణ అభిస్తుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. వృషభ రాశి : ప్రభుత్వం వద్ద నుండి ఎదురుచూస్తున్న అనుమతులు రావడం సంతోషాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రుల మూలక సౌఖ్యము లభిస్తుంది. శరీరము ఆరోగ్యంగా వుంటుంది. వివాహప్రయత్నాలు చేసేవారు శుభావార్తలు వింటారు. మిథున రాశి : సంతాన మూలక అశాంతి కలుగవచ్చును. వృత్తి, ఉద్యోగాలలో మార్పులు కలుగవచ్చును. చెప్పుడు […]

మేష రాశి : శరీర బాధలు ఉపశమిస్తాయి. క్రీడాకారులకు శ్రమ ఎక్కువైనను విజయం సాధిస్తారు. ఇష్టమైన వ్యక్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పెద్దల ఆదరణ అభిస్తుంది. ధన ప్రాప్తి కలుగుతుంది.
వృషభ రాశి : ప్రభుత్వం వద్ద నుండి ఎదురుచూస్తున్న అనుమతులు రావడం సంతోషాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రుల మూలక సౌఖ్యము లభిస్తుంది. శరీరము ఆరోగ్యంగా వుంటుంది. వివాహప్రయత్నాలు చేసేవారు శుభావార్తలు వింటారు.
మిథున రాశి : సంతాన మూలక అశాంతి కలుగవచ్చును. వృత్తి, ఉద్యోగాలలో మార్పులు కలుగవచ్చును. చెప్పుడు మాటలను వినకండి, అవమానముల పాలవుతారు. శరీర బలహీనత బాధిస్తుంది.
కర్కాటక రాశి : ఉదర సంబంధమైన వ్యాధులు బాధించవచ్చును. వాహన మూలక భయము కలుగవచ్చును. ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవలసి వస్తుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.
సింహ రాశి : పట్టుదలతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేయుదురు. ఇష్టమైన భోజనం సంతోషాన్నిస్తుంది. వ్యాపార వర్గముల వారికి శుభములు కలుగుతాయి. భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి.
కన్యా రాశి : జీవిత భాగస్వాములతో ముఖ్యమైన సంభాషణలు ఆనందాన్నిస్తాయి. శత్రువులపై పై చేయి సాధిస్తారు. భగవంతుని సేవ ఆనందాన్నిస్తుంది. మొండి బకాయిలు వసూలవడం వలన ధనప్రాప్తి కలుగుతుంది.
తులా రాశి : సోమరితనము వలన నష్టపోతారు. ఇంట్లో వారిపై అపవాదులు రావడం బాధిస్తుంది. మోసపోయే ప్రమానం వున్నది, జాగ్రత్తగా వుండండి. విశేష ధనవ్యయము కనిపిస్తున్నది. ధైర్యంగా వుండడానికి ప్రయత్నించండి.
వృశ్చిక రాశి : కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. శరీరంలో వేడి ఎక్కువవడం వలన ఇబ్బంది పడతారు. కలహముల మూలకంగా అశాంతి కలుగవచ్చును. ఎవరినీ బాధపెట్టే పనులు చేయకండి.
ధనుస్సు రాశి : కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. శత్రువుల నుండి రావలసిన వస్తువులు, ధనము చేతి కందుతాయి. క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శననిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి.
మకర రాశి : శరీర బాధలకు వైద్యుడిని సంప్రదించవలసి రావచ్చాను. జరిమానాలు కట్టవలసి రావచ్చును. పెద్దలతో విరోధములు ఏర్పడవచ్చును. యత్నకార్యములను వాయిదా వేసుకోవడం మంచిది. అపవాదులు బాధిస్తాయి.
కుంభ రాశి : ఆకస్మిక ధనప్రాప్తి సంతోషాన్నిస్తుంది. సత్సంగములో పాల్గొనడం ఉల్లాసాన్నిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఆనందాన్ని కలుగజేస్తుంది. నూతన కార్యాలోచనలు ముందుకు సాగుతాయి.
మీన రాశి : ప్రయణ మూలకంగా శ్రమ కలుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రతికూలతలు ఎదురౌతాయి. గతంలో చేసిన పొరపాట్లు వలను చింతించవలసి వస్తుంది. సోదర వర్గము సహాయము కోరవలసివస్తుంది.
- తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్ నంబర్ : +91 99490 11332.
