విధాత: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపల రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి సెక్టార్ కు ప్రత్యేకంగా అధికారులను కేటాయించామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
ప్రస్తుతం క్యూలైన్లలోకి చేరుకుంటున్న భక్తులు శ్రీవారి దర్శనానికి రెండ్రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు నిరంతరాయంగా ఆహార సదుపాయం కల్పిస్తున్నామని, ఆదివారం రాత్రికి భక్తుల రద్దీ తగ్గే అవకాశముందని ఈవో వివరించారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా వారాంతాల్లో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు వెల్లడించారు. వారాంతపు ఆర్జిత సేవలను కూడా రద్దు చేశామన్నారు.