Banana | అరటి పండును తినేందుకు అందరూ ఇష్టపడుతారు. ఉదయం లేవగానే అరటి పండు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇంకొందరు వ్యాయామం( Exercise ) చేసిన వెంటనే ఒక అరటి పండును తినేస్తుంటారు. మరికొందరైతే బ్రేక్‌ఫాస్ట్( Breakfast )ను పక్కన పెట్టేసి.. అరటి పండ్లనే లాగేస్తుంటారు. అయితే అరటి పండు తినేందుకు షుగర్ వ్యాధిగ్రస్తులు( Diabetes ) ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. షుగర్ ఉన్నవారు అరటి పండు తినకపోవడం మంచిదని కొందరు సలహా ఇస్తే.. రోజుకు ఒక అరటి పండు తినడం వల్ల నష్టమేమి లేదని మరికొందరు సూచిస్తుంటారు. అసలు ఈ రెండింటిలో వాస్తవం ఏంటో చూద్దాం..
- అరటి పండు( Banana Fruit )లో పొటాషియం, ఫైబర్, విటమిన్లు, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో తక్షణమే శక్తి ఉత్పత్తి అవుతుంది. అయితే అరటిలో ఉండే సహజ సిద్ధమైన చక్కెరల వల్ల రక్తంలో గ్లూకోజ్( Blood Glucose ) స్థాయిలు పెరుగుతాయి. అయితే ఈ గ్లూకోస్ స్థాయిలను కంట్రోల్ చేసేందుకు అరటి పండుతో పాటు కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం బ్లడ్ గ్లూకోజ్ పెరగదు. కాబట్టి రోజుకు ఒక అరటి పండు తినడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు పెద్ద నష్టం జరిగే అవకాశం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
- అయితే చాలా మంది అరటి పండ్లను ఖాళీ కడుపున తింటుంటారు. ఇది మంచిది కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అరటిలో అనేక రకాల పోషక పదార్థాలు ఉన్నా ఆమ్లతత్వం కూడా ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటి తింటే.. ఆమ్లతత్వం వల్ల ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అరటి పండుతో పాటు ఉడకబెట్టిన కోడిగుడ్లు లేదా బాదం, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్‌ను తీసుకోవడం మంచిది. అప్పుడు ఎసిడిటీ ఏర్పడే అవకాశం ఉండదు.
- అరటి పండు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ప్రతి అరటి పండులో మూడు గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. దీంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినడం వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.
- అరటిపండులో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లను అతిగా తినటం వల్ల రక్తంలో మెగ్నిషియం బాగా పెరిగిపోయే అవకాశముంటుంది. రక్తంలో మెగ్నిషియం, కాల్షియం విలువల మధ్య తేడా వచ్చినప్పుడు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.