Home Latest news చేసే పని తోటమాలి.. కోట్లల్లో ఆస్తులు

చేసే పని తోటమాలి.. కోట్లల్లో ఆస్తులు

  • 13 రోజుల్లో రిటైర్మెంట్
  • సోదాల్లో 4 ఇల్లు, 3 కార్లు, విలువైన ఆస్తులు
  • ఏసీబీకి చిక్కిన శివ‌లింగ‌య్య

విధాత‌: కర్ణాటక బీడీఏ (బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ)లో గార్డెనర్(తోటమాలి)గా పనిచేస్తున్న శివలింగయ్య పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టాడని ఏసీబీ సోదాల్లో బయటపడింది. బెంగళూరు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో శివయ్యకు ఏకంగా 4 ఇండ్లు ఉన్నాయి.

జేపీ నగర్‌లో 2, కుమారస్వామీ లేఅవుట్ 1, దొడ్డకుల్లసంద్రాలో 1 చొప్పున ఇళ్లు ఉన్నాయి. అంతేకాదు దొడ్డకుల్లసంద్రాలో ఒక ఓపెన్ సైట్, రామనగర జిల్లాలోని చెన్నపట్టణ తాలూకాలో 1 ఎకరా 9 గుంటల వ్యవసాయ భూమి అతడి పేరు మీద ఉన్నాయి.

శివయ్యకు 510 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి ఆభరణాలతోపాటు రూ.10 లక్షల విలువైన ఇంటి సామ‌గ్రిని గుర్తించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అంతేకాదు శివలింగయ్యకు ఏకంగా 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు, రూ.86 వేల నగదు, రూ.80 వేల డిపాజిట్లను గుర్తించామని చెప్పారు.

ప్రస్తుతం 60 ఏళ్ల వయసున్న ఆయ‌న మరో 13 రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం తోటమాలిగా పనిచేస్తున్న శివలింగయ్య గతంలో బీడీఏలో ఏఈఈ(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు.

బనశంకరి బీడీఏ ఆఫీస్‌లో దీర్ఘకాలంపాటు పనిచేసిన అతడు సాదాసీదా వ్యక్తిలా మెలిగేవాడు. శివయ్య కొడుకు ఒక బార్‌ను నిర్వహిస్తుండ‌గా.. ఇంజినీరింగ్ గ్యాడ్యుయేట్ అయిన అతడి కూతురు విదేశాల్లో ఉందని అధికారులు పేర్కొన్నారు.

శివలింగయ్యకు బీడీఏకి సంబంధించిన అంశాలన్నింటిపైనా అతడికి విశేష అవగాహన ఉంది. అధికారిక, అనధికారిక లే అవుట్లు, అక్రమణల గురించి అతడికి బాగా తెలిసి ఉండడంతోనే ఇదంతా ఇన్ని అస్థి పాస్తులు సంపాదించి ఉండవచ్చని ఏసీబీ అధికారులు విస్తుపోయారు. కాగా శివయ్యపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వారు వెల్లడించాల్సి ఉంది.

కాగా గత శుక్రవారం నుంచి 21 మంది అధికారులపై కర్ణాటక ఏసీబీ విస్తృతస్థాయి దాడులు కొనసాగిస్తోంది. మొత్తం 80 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్‌లో పెద్ద మొత్తంలో ఏసీబీ అధికారులను మోహరించింది. సోదాల్లో భాగంగా వేర్వేరు శాఖల్లో పనిచేస్తున్న, కొందరు రిటైర్డ్ అధికారుల ఇళ్లల్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు.

RELATED ARTICLES

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం

విధాత : ఏపీలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని రూ.800 కోట్లు విత్...

ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో వచ్చే సినిమాలివే

విధాత‌: ఈ వారం థియేటర్లలో వద్ద సినిమాల సందడి కాస్త తగ్గనుంది. ఈ వారం మళయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్‌ నటించిన బహుబాషా చిత్రం కడువ తప్పితే పెద్దగా పేరున్న చిత్రాలేవి విడుదల...

భువనగిరి: వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

విధాత,యాదాద్రి భువనగిరి: భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వే నెంబర్ 797.798.621లో 4ఎకరాలు వక్ఫ్ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని...

Alert.. అవసరమైతే తప్పా బయటకు రావొద్దు: GHMC

విధాత‌, హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. అల్వాల్ సర్కిల్ పరిధిలో దాదాపు గంటన్నర సేపు వర్షం కుర‌వ‌డంతో రహదారులు వర్షపు నీటితో...

మెరుగైన వైద్య సేవల్లో ఎయిమ్స్ ముందంజ: గవర్నర్ తమిళి సై

విధాత, యాదాద్రి భువనగిరి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎయిమ్స్ వైద్య సంస్థలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ అన్నారు. మంగళవారం ఆమె...

ఆలోచనతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి: టీ హ‌బ్ 2ను ప్రారంభించిన CM KCR

విధాత‌, హైద‌రాబాద్: ‘ఆలోచనతో రండి – ఆవిష్కరణలతో వెళ్లండి’’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని మాదాపూర్-రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్, ‘టీ...

తాజా వార్త‌లు

తెలంగాణ ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం: AR రెహమాన్

విధాత: తెలంగాణ ప్రభుత్వం ఐటీ హబ్ హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-హబ్ ఫేజ్2 భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ముఖ్య...

Breaking: జూన్ 30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు

విధాత‌, హైదరాబాద్: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుదల చేయనున్నారు. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి...

ఇది రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం: మంత్రి హ‌రీశ్‌రావు

విధాత, హైద‌రాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సంబరం మొద‌లైంద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎక‌రం వ‌ర‌కు భూమి క‌లిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.66...

ఇంటర్‌లో అవిభక్త కవల‌లు వీణ, వాణిల అద్భుత ప్ర‌తిభ‌

విధాత‌, హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ మార్కులతో...