ఈడీ అధికారులకు ఆ సీక్రెట్ చెప్పలేదు
విధాత: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఐదు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. మొత్తం 55 గంటలకు పైగా రాహుల్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ సమయంలో అధికారులకు రాహుల్ ఓపిగ్గా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే తన ఓపిక, ఓర్పును చూసి దర్యాప్తు అధికారులు ఆశ్చర్యపోయారని, తన ఎనర్జీ సీక్రెట్‌ని అడగ్గా.. తాను మాత్రం ఆ నిజం చెప్పలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సత్యాగ్రహలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు.
ఐదు రోజుల పాటు తాను ఎదుర్కొన్న విచారణ ప్రక్రియను రాహుల్ గాంధీ వివరించారు. అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చానని, అన్ని సమాధానాలను తనిఖీ చేశానని కూడా పేర్కొన్నారు. ఎక్కువ శాతం కుర్చీలోనే కూర్చున్నానని, దీంతో ఇంత ఓపికగా ఎలా ఉన్నారని అధికారులు అడిగినట్లు తెలిపారు.
‘ఎలాంటి అలసటా లేకుండా 11 గంటలపాటు కుర్చీలో ఎలా కూర్చోగలిగారని గత రాత్రి ఈడీ అధికారులు నన్ను అడిగారు. కానీ అసలు కారణం చెప్పకూడదని అనుకున్నా. అందుకే ‘విపాసన’ చేస్తానని అబద్దం చెప్పా’ అని పేర్కొన్నారు. కానీ అసలు నిజం ఏంటో ఈ సందర్భంగా తెలిపారు.
LIVE: Shri @RahulGandhi addresses party workers at AICC Headquarters.#होगी_सच_की_जीतhttps://t.co/7Ya7a2nWBY
— Telangana Congress (@INCTelangana) June 22, 2022
‘2004 నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నా. అందుకే నాకు ఓపిక ఉంటుంది. పార్టీ మనల్ని అలసి పోనివ్వదు. సహనం, ఓర్పును నేర్పుతుంది’ అని అన్నారు. ‘ఒక చిన్న గదిలో ముగ్గురు ఈడీ అధికారులు నన్ను ప్రశ్నించారు. కానీ నేను ఆ గదిలో ఒంటరిగా లేను. దేశంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు నాతో పాటు ఉన్నారు. స్వేచ్ఛను విశ్వసించే వారందరూ నాతో ఉన్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
అగ్నిపథ్ పథకం తీసుకురావడంపై ఈ సందర్భంగా బీజేపీ సర్కారుపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. సైన్యాన్ని బలహీన పరుస్తోందని విమర్శించారు. గతంలో సాగు చట్టాలను ఉపసంహరించుకున్నట్టుగానే ‘అగ్నిపథ్’ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
I have said it earlier, I am saying it again we get patience & motivation when ever we meet simple man with golden heart @RahulGandhi anna.. #NaDarengeNaJhukenge #RahulGandhi @priyankagandhi @kcvenugopalmp @manickamtagore @revanth_anumula @MahilaCongress @srinivasiyc pic.twitter.com/GJK4vUjoeR
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) June 22, 2022