విధాత: 41 ఏళ్ల నాటి ఓ కేక్ ముక్కను వేలం వేయనున్నారు. అసలు 41 ఏళ్ల నాటి కేకు ముక్కను వేలం వేస్తున్నారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది మరి. నిజమే మరి.. ఆ కేక్ ముక్కకు అంతటి ఘనత ఉందండోయ్. బ్రిటన్ కింగ్ చార్లెస్, రాణి డయానా పెళ్లి నాటి కేక్ ముక్క కావడమే ఆ కేక్ విశేషం. ఈ కేక్ ముక్కను దక్కించుకోవడానికి ఎంతో మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండు చెందిన డోరే అండ్ […]

విధాత: 41 ఏళ్ల నాటి ఓ కేక్ ముక్కను వేలం వేయనున్నారు. అసలు 41 ఏళ్ల నాటి కేకు ముక్కను వేలం వేస్తున్నారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది మరి. నిజమే మరి.. ఆ కేక్ ముక్కకు అంతటి ఘనత ఉందండోయ్. బ్రిటన్ కింగ్ చార్లెస్, రాణి డయానా పెళ్లి నాటి కేక్ ముక్క కావడమే ఆ కేక్ విశేషం. ఈ కేక్ ముక్కను దక్కించుకోవడానికి ఎంతో మంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇంగ్లండు చెందిన డోరే అండ్ రీస్ ఆక్షన్స్ అనే సంస్థ ఏకంగా 41 ఏండ్ల క్రితం నాటి కేకును వేలం వేసేందుకు సిద్ధమైంది. 1981లో జరిగిన కింగ్ చార్లెస్ - ప్రిన్సెస్ డయానాల పెళ్లికి ప్రపంచ దేశాల నుంచి 3వేల మందికి పైగా బంధుమిత్రులు హాజరయ్యారు. లక్షలాది మంది ఆ వివాహాన్ని టీవీల్లో వీక్షించారు. దాంతో 20వ శతాబ్దంలోనే గొప్ప వివాహంగా అది రికార్డుల్లో నిలిచింది.

అయితే పెళ్ళికి మూడు వేల మందిలో నిగెల్ రికెట్స్ అనే వ్యక్తి హాజరైయారు. ఆయనకు కూడా ఈ పెళ్లిలో ఓ కేకు ఇచ్చారు. నిగెల్ ఆ కేకును ఇంటికి తీసుకెళ్లి పూర్తిగా తినకుండా కొంత భాగాన్ని భద్రపరిచారు. గత ఏడాది ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఆయన భద్రపరిచిన కేకు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. నిగెల్ రికెట్స్ భద్రపరిచిన ఆ కేకు ముక్కను ఇప్పుడు వేలం వేయబోతున్నారు. వేలంలో ఆ కేకు ముక్క ప్రారంభ ధరను భారత కరెన్సీలో సుమారు రూ.27వేలుగా నిర్ణయించారు.

నిగెల్ రికెట్స్ బతికి ఉండగా.. ఈ కేకులోని ఓ ముక్కను వేలం వేశారు. 2014లో జరిగిన ఈ వేలంలో ఈ కేకు ముక్క మన కరెన్సీలో రూ.1.27 లక్షలు పలికింది. కాగా రికెట్స్, ఇతర రాజ కుటుంబ సభ్యులు చార్లెస్ డయానా కోసం వివాహ కానుకగా ఒక రైటింగ్ టేబులు బహూకరించారట.

ఆ టేబుల్ను చూసి కింగ్ చార్లెస్ చాలా సంతోషపడ్డారట. ఇదిలాఉంటే 1981, జూలై 29న జరిగిన చార్లెస్-డయానాల వివాహ బంధం కొన్నేండ్లకే తెగిపోయింది. 1992లో వారు విడిపోయారు. ఆ తర్వాత నాలుగేళ్లకు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఓ ప్రమాదంలో డయానా మరణించారు.

Updated On 20 Oct 2022 4:45 AM GMT
krs

krs

Next Story