లండన్: ఆగస్టు నాటికి బ్రిటన్ లో కరోనా వైరస్ అంతమైపోతుందని వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా రిటైరవుతున్న క్లైవ్ డిక్స్ చెప్పారు. ఆగస్టు మధ్య నాటికి బ్రిటిష్ ప్రజల్లో వైరస్ కదలికలు ఆగిపోతాయని ఆయన టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2022 తొలి మాసాల్లో వ్యాక్సిన్ బూస్టర్ ప్రోగ్రాం చేపట్టవచ్చని ఆయన సూచించారు. కరోనాను తట్టుకునే శక్తి లేనివారి కోసం బూస్టర్ షాట్ ను ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం చేయాలని డిక్స్ […]

లండన్: ఆగస్టు నాటికి బ్రిటన్ లో కరోనా వైరస్ అంతమైపోతుందని వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా రిటైరవుతున్న క్లైవ్ డిక్స్ చెప్పారు. ఆగస్టు మధ్య నాటికి బ్రిటిష్ ప్రజల్లో వైరస్ కదలికలు ఆగిపోతాయని ఆయన టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2022 తొలి మాసాల్లో వ్యాక్సిన్ బూస్టర్ ప్రోగ్రాం చేపట్టవచ్చని ఆయన సూచించారు.

కరోనాను తట్టుకునే శక్తి లేనివారి కోసం బూస్టర్ షాట్ ను ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం చేయాలని డిక్స్ చెప్పారు. జూలై చివరి నాటికి దేశంలోని వారంతా కనీసం ఒక్క డోసు టీకా అయినా తీసుకుంటారని ఆశిస్తున్నట్టు వివరించారు. బ్రిటన్ లో ఇప్పటి వరకు 5 కోట్ల పైచిలుకు టీకాలు ఇచ్చారు.

వయోజనుల్లో సగానికి పైగా మందికి సత్వరమే మొదటి డోసు పూర్తిచేసిన రెండో దేశంగా బ్రిటన్ రికార్డు సృష్టించింది. అమెరికా ఈసరికే గరిష్ట స్థాయిలో టీకాల కార్యక్రమం పూర్తి చేయడమే కాకుండా.. టీకాలు వేసుకున్నవారు మాస్కులు లేకుండా పబ్లిగ్గా తిరగొచ్చని ప్రకటించింది.

Updated On 8 May 2021 6:31 AM GMT
subbareddy

subbareddy

Next Story