Instagram Down | మెటా సంస్థ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయ్యింది. గురువారం ఉదయం నుంచి మొరాయిస్తున్నది. డౌన్ డిటెక్టర్ అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌లో ఉదయం నుంచి దాదాపు 27,000 మందికిపైగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయ్యిందంటూ ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ యాప్, వెబ్‌సైట్ రెండింటిలోనూ యాక్సెస్ కష్టంగా ఉందని 50 శాతం మంది పేర్కొన్నారు.
IT CAME BACK NOW IT SHUT DOWN AGAIN WTF #instagramdown pic.twitter.com/Ezp5ythAa1
— Ricky Spanish (@rickyiEspanish) March 9, 2023
instagram after they said they fixed everything #instagramdown pic.twitter.com/0FmBiXUrH4
— 🍆 (@prettywheninutx) March 9, 2023
ఇన్‌స్టాలాగిన్‌లో సమస్యలున్నాయని మరో 20శాతం మంది ఫిర్యాదు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డౌన్‌డెటెక్టర్ యూకే నుంచి 2వేలమందికిపైగా వినియోగదారులు, భారత్, ఆస్ట్రేలియా నుంచి వెయ్యి మందికిపై ఫిర్యాదు చేశారు. అయితే, ఈ విషయంపై ఇప్పటి వరకు మెటా యాజమాన్యం స్పందించలేదు. సాంకేతిక సమస్యలకు కారణం ఏమిటన్నది తెలియరాలేదు. ఇన్‌స్టాగ్రామ్ మొరాయిస్తున్న నేపథ్యంలో ట్విట్టర్‌లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
me after turning my wifi on and off for 10 minutes when it was actually instagram that's down. #instagram #instagramdown pic.twitter.com/9jXMLFXPLr
— sheryl (@sherylsethi) March 9, 2023
Me coming to Twitter every single time to see if #Instagram is down or to see if it’s just me. 🤷🏻♀️ pic.twitter.com/ptPz8dCfAX
— Courtney Woytko (@cdubbbb) March 9, 2023
Checking #twitter to check if #instagram is down. pic.twitter.com/cu6MQTrFI3
— gabe (@iheartmc) March 9, 2023