• ఇన్వో సెల్ పద్ధతిలో జన్మనిచ్చిన స్వలింగ జంట

మాడ్రిడ్ : ఈ భూ ప్రపంచం లో ఓ మహిళ బిడ్డకు జన్మ నివ్వడం సహజమే! ప్రకృతిలో మనం కనీవినీ ఎరుగని కొన్ని ఘటనలు టెక్నాలజీ సాయంతో నేడు సాధారణంగా జరిగిపోతున్న విచిత్రలయ్యాయి. అటువంటిదే ఈ విచిత్రం. ఇటీవలి కాలంలో స్వలింగ జంటలు కూడా పలు పద్ధతుల ద్వారా బిడ్డకు జన్మనిస్తున్నాయి. స్వలింగ జంటలు బిడ్డకు జన్మనివ్వడమే విచిత్రం అనుకుంటే ఏకంగా ఇద్దరు కలిసి ఒక బిడ్డనే కడుపున మోశారు. ఈ విచిత్ర ఘటన స్పెయిన్ లో జరిగింది. అక్టోబర్ 30న వారు ఒక మెగా బిడ్డకు జన్మనిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మజోర్మాలోని పాల్మాలో 30 ఏళ్ల ఎస్టీ ఫానియా, 27 ఏళ్ల అజహారా స్వలింగ జంట. ఇద్దరు మహిళలే కాబట్టి వారికి మాతృత్వం పొందే అవకాశం సహజంగా లేదు.


అయితే అమ్మతనాన్ని ఆస్వాదించాలి అని కలలు కంటున్న ఆ జంట ఇందుకోసం ఒక ఫర్టిలిటీ సెంటర్ కు వెళ్లారు. ముందుగా ఎస్టీఫానియా అండంలోకి వీర్యకణాలు ప్రవేశపెట్టి ఫలధీకరణం చెందేలా చేశారు. ఐదు రోజుల తర్వాత ఆ పిండాన్ని తిరిగి అజాహారా గర్భంలో ప్రవేశపెట్టారు. అజాహారా ఆ పిండాన్ని 9 నెలల పాటు తన గర్భంలో మోసింది. చివరకు అక్టోబర్ 30న అజాహారా ఓ బాలుడికి జన్మనిచ్చింది. అతడి పేరు డెరేక్ ఎల్లోయ్. ఇలా ఒకే బిడ్డను ఎస్టీఫానియా,అజాహారాలు ఇద్దరూ తమ గర్భంలో మోశారు. తమ కలను నిజం చేసుకోవడానికి వారు నాలుగు లక్షలకు పైగా ఖర్చు పెట్టారట. ఇలా ఒకే బిడ్డను ఇద్దరు గర్భంలో మోయడం ఇదే మొదటిసారి కాదు. ఐదేళ్ల క్రితం టెక్సాస్ లో ఓ స్వలింగ జంట ఇలానే ఓ బిడ్డను కన్నారట. ఈ జంట కూడా మహిళలే కావడం మరో విశేషం. ఇలా బిడ్డను కనడాన్ని మెడికల్ భాషలో ఇన్వో సెల్ అంటారు.

Updated On
Subbu

Subbu

Next Story