విధాత : ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంది. పాయిజ‌న్ సేవించ‌డ‌మో, ఉరేసుకోవ‌డం లాంటి ప‌నులు చేయ‌లేదు ఆ మ‌హిళ‌. ఏకంగా 55 బ్యాట‌రీలు మింగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. కానీ ఆమె చివ‌ర‌కు బ‌తికింది. ఐర్లాండ్‌కు చెందిన 66 ఏండ్ల మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో 55 బ్యాట‌రీలు(AA, AAA) మింగేసింది. కానీ ఆమెకు ఎలాంటి హానీ జ‌ర‌గ‌లేదు. కేవ‌లం క‌డుపు నొప్పితో మాత్ర‌మే బాధ‌ప‌డింది. దీంతో డ‌బ్లిన్‌లోని సెయింట్ విన్‌సెంట్ యూనివ‌ర్సిటీ హాస్పిట‌ల్ వైద్యుల‌ను బాధితురాలు […]

విధాత : ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకుంది. పాయిజ‌న్ సేవించ‌డ‌మో, ఉరేసుకోవ‌డం లాంటి ప‌నులు చేయ‌లేదు ఆ మ‌హిళ‌. ఏకంగా 55 బ్యాట‌రీలు మింగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. కానీ ఆమె చివ‌ర‌కు బ‌తికింది.

ఐర్లాండ్‌కు చెందిన 66 ఏండ్ల మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో 55 బ్యాట‌రీలు(AA, AAA) మింగేసింది. కానీ ఆమెకు ఎలాంటి హానీ జ‌ర‌గ‌లేదు. కేవ‌లం క‌డుపు నొప్పితో మాత్ర‌మే బాధ‌ప‌డింది. దీంతో డ‌బ్లిన్‌లోని సెయింట్ విన్‌సెంట్ యూనివ‌ర్సిటీ హాస్పిట‌ల్ వైద్యుల‌ను బాధితురాలు సంప్ర‌దించింది. వారు ఎక్స్ రే తీయ‌గా.. క‌డుపులో పేగుల్లో బ్యాట‌రీలు ఉన్న‌ట్లు గుర్తించారు.

ఆ బ్యాట‌రీల‌ను న్యాచుర‌ల్‌గా బ‌య‌ట‌కు తీయాల‌ని భావించారు. మొద‌టి వారంలో కేవ‌లం ఐదు బ్యాట‌రీలు మాత్ర‌మే పాయువు ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మిగ‌తా బ్యాట‌రీలు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించారు. స‌ర్జ‌రీ ద్వారా 46 బ్యాట‌రీల‌ను బ‌య‌ట‌కు తీశారు. పేగుల్లో ఉన్న మ‌రో 4 బ్యాట‌రీల‌ను ఆమె పాయువు ద్వారా బ‌య‌ట‌కు తీసిన‌ట్లు వైద్యులు తెలిపారు.

అయితే ఈ బ్యాట‌రీలు జీర్ణ వ్య‌వ‌స్థ‌కు, పేగుల‌కు, ఇత‌ర అవ‌య‌వాల‌కు ఎలాంటి హానీ క‌లిగించ‌లేద‌ని డాక్ట‌ర్లు స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం బాధిత మ‌హిళ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు.

Updated On 20 Sep 2022 3:13 AM GMT
subbareddy

subbareddy

Next Story