HomeLatest newsఇది రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం: మంత్రి హ‌రీశ్‌రావు

ఇది రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం: మంత్రి హ‌రీశ్‌రావు

విధాత, హైద‌రాబాద్ : రాష్ట్రంలో రైతు బంధు సంబరం మొద‌లైంద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎక‌రం వ‌ర‌కు భూమి క‌లిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ. 586.66 కోట్ల న‌గ‌దు జ‌మ చేసిన‌ట్లు తెలిపారు. ఇవి అంకెలు కావు. రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ అంకితభావానికి సిసలైన ఆనవాళ్లు అని ఆయ‌న పేర్కొన్నారు. మొత్తం 68.10 లక్షల రైతులకు రూ. 7,521 కోట్లు పెట్టుబడి సాయంగా అందించనుందని మంత్రి హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు.

కేంద్రం అనేక ఆర్ధిక ఇబ్బందులు సృష్టిస్తున్నా అన్నదాతలకు ఏ లోటు రానివ్వద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధు కింద పెట్టుబ‌డి సాయాన్ని అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ దృఢ సంకల్పానికి యావత్ రైతులోకం జేజేలు పలుకుతున్నదని మంత్రి అన్నారు. తొలకరి రైతుకు ప్రకృతి ఇచ్చిన వరం.. రైతుబంధు అన్నదాతకు ప్రభుత్వం అందిస్తున్న వరమ‌ని ఇది రైతు ప్రభుత్వం.. రైతు బిడ్డ పరిపాలిస్తున్న ప్రభుత్వం అని హ‌రీశ్‌రావు కొనియాడారు.

RELATED ARTICLES

తాజా వార్త‌లు

error: Content is protected !!