విధాత: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌లో బుధవారం జరిగిన ఒక ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. ఈ ఉగ్రవాదుల్లో ఒకడు ఈనెల మొదట్లో కుల్గావ్లో బ్యాంక్ మేనేజర్‌ను హత్య చేసినవాడని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులిద్దరు నిషేధిత లష్కర్ ఏ తాయిబా సంస్థకు చెందిన వారని చెప్పారు.
బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్‌ను పట్టపగలే ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన కలకలం సృష్టించింది. ఈరోజు ఎన్కౌంటర్లో మరణించిన జాన్ మహమ్మద్ లోనే, బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్‌ను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. కుల్గావ్లో బుధవారం మరో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఒక ఇంట్లో నక్కిన ఉగ్రవాది కోసం గాలిస్తుండగా కాల్పులు మొదలయ్యాయి. ఆ ఉగ్రవాది ఈనెల 8న స్కూల్ టీచర్ రజనీ బాలాను హత్యచేసిన వాడని పోలీసులు చెప్పారు.