Bhoomi sunil | రైతులకు చట్టాలను చుట్టాలు చేయడమే లక్ష్యంగా ‘సాగు న్యాయ యాత్ర’
భూమి సునీల్ సారథ్యంలో లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీప్స్) ఆధ్వర్యంలో సాగు న్యాయ యాత్ర ఇవాళ(బుధవారం) భువనగిరి, సూర్యాపేట, జనగాం జిల్లాల్లో కొనసాగింది.
విధాత, హైదరాబాద్ :
భూమి సునీల్ సారథ్యంలో లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీప్స్) ఆధ్వర్యంలో సాగు న్యాయ యాత్ర ఇవాళ(బుధవారం) భువనగిరి, సూర్యాపేట, జనగాం జిల్లాల్లో కొనసాగింది. జిల్లా పరిధిలోని రాయగిరి నుండి ఆత్మకూరు – అడ్డగూడూర్ – తిరుమలగిరి – కొడకండ్ల – దెవురుప్పల మీదుగా జనగాం వరకు సాగుయాత్ర సాగింది. అలాగే 17వ తేదీన జనగాం, సూర్యాపేట జిల్లాలో సాగు న్యాయ యాత్ర ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. రైతులకు చట్టాలను చుట్టాలు చెయ్యడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. కాగా, ఈ సాగు న్యాయ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగనుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram