Bangalore | నాలుగో తరగతి విద్యార్థికి 23 చెంపదెబ్బలు.. ఉపాధ్యాయురాలిపై కేసు నమోదు
విధాత: నాలుగో తరగతి విద్యార్థిని ఒకే చెంపపై 23 సార్లు కొట్టినందుకు ఓ ప్రైమరీ స్కూల్ టీచర్‌పై కేసు నమోదైంది. హోం వర్క్‌ను విద్యార్థి డైరీలో రాసి పంపాలని ఆ టీచర్‌కు తల్లిదండ్రులు చెప్పడమే ఈ చెంపదెబ్బలకు కారణమైంది. బాలుడి తండ్రి తెలిపిన మేరకు.. బాధిత విద్యార్థి బెంగళూరు (Bangalore) వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఓ ప్రైమరీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో పిల్లాడు అసలు హోం వర్క్ చేయట్లేదని బాలుడి తల్లిదండ్రలతో ఇటీవల సదరు […]

విధాత: నాలుగో తరగతి విద్యార్థిని ఒకే చెంపపై 23 సార్లు కొట్టినందుకు ఓ ప్రైమరీ స్కూల్ టీచర్‌పై కేసు నమోదైంది. హోం వర్క్‌ను విద్యార్థి డైరీలో రాసి పంపాలని ఆ టీచర్‌కు తల్లిదండ్రులు చెప్పడమే ఈ చెంపదెబ్బలకు కారణమైంది. బాలుడి తండ్రి తెలిపిన మేరకు.. బాధిత విద్యార్థి బెంగళూరు (Bangalore) వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఓ ప్రైమరీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు.
ఈ నేపథ్యంలో పిల్లాడు అసలు హోం వర్క్ చేయట్లేదని బాలుడి తల్లిదండ్రలతో ఇటీవల సదరు టీచర్ పాఠశాలలో సమావేశమయ్యారు. హోంవర్క్‌ను తమ బాబుకు చెప్పడం కాకుండా డైరీలో రాసి ఇవ్వాలని తల్లిదండ్రులు కోరారు. దానికి టీచరమ్మ అలాగేనని ఒప్పుకొంది. విద్యార్థి తల్లిదండ్రులు తన పనికే వంక పెట్టడంతో ఆవిడ ఉడికిపోయి విద్యార్థిని తరగతిలోనే చెంప దెబ్బలు కొట్టింది.
ఇంటికి వచ్చిన బాలుడి చెంప వాచిపోయి ఉండటంతో తల్లి అడగగా.. మొత్తం వివరాలు చెప్పాడు. వేరే చోట ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆ తల్లిదండ్రులు.. హుటాహుటిన పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్‌ను ప్రశ్నించారు. వారు ఏ సమాధానం చెప్పకపోగా ఆ ఉపాధ్యాయురాలిని ఇంటికి పంపేశారు. దీంతో విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు రంగప్రవేశం చేసి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు.
అందులో విద్యార్థి చెంపపై 30 నిమిషాల వ్యవధిలో 23 సార్లు ఆ ఉపాధ్యాయురాలు చెంపదెబ్బలు కొట్టినట్లు కనపడింది. ఈ ఆరోపణలను ధ్రువీకరించుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్, ఉపాధ్యాయురాలు, మరికొందరికి నోటీసులు జారీ చేశారు. వచ్చే వారం సదరు ఉపాధ్యాయురాలి వివాహం ఉన్న కారణంగా.. దర్యాప్తునకు హాజరవడానికి కాస్త సమయమడిగారని పోలీసులు తెలిపారు. అయితే ఆవిడ ప్రాథమిక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని వెల్లడించారు.