స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు

విధాత : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరీ చేయడం పట్ల సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్కీల్ స్కామ్ కేసులో బాబుకు వ్యతిరేకంగా సీఐడీ సమర్పించిన ఆధారాలను ఏపీ హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని, దర్యాప్తు దశలోనే కేసులో సాక్షాలు లేవని చెప్పడం సరికాదని పిటీషన్‌లో పేర్కోన్నారు. బెయిల్ మంజూరీపై హైకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోరారు.

Updated On
Subbu

Subbu

Next Story