Congress | కడెం కాంగ్రెస్‌ నాయకులను విడుదల చేయాలిః కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి

Congress విధాత: కడెం ప్రాజెక్ట్ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం దారుణమని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి విమర్శంచారు. వెంటనే అరెస్టు చేసిన తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అసమర్థత వల్లే కడెం ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకోవడం లేదన్నారు. పోయిన ఏడాది కూడా గేట్ల సమస్యతోనే ఇబ్బంది ఏర్పడి సాగు భూములు కోత కు గురయ్యాయని, గేట్ల పని తీరును పర్యవేక్షించి సరి […]

  • Publish Date - July 27, 2023 / 01:25 AM IST

Congress

విధాత: కడెం ప్రాజెక్ట్ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం దారుణమని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి విమర్శంచారు. వెంటనే అరెస్టు చేసిన తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అసమర్థత వల్లే కడెం ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకోవడం లేదన్నారు. పోయిన ఏడాది కూడా గేట్ల సమస్యతోనే ఇబ్బంది ఏర్పడి సాగు భూములు కోత కు గురయ్యాయని, గేట్ల పని తీరును పర్యవేక్షించి సరి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు.

భేషరతుగా ప్రభుత్వం తమ తప్పును ఒప్పుకోవాల్సిందేనన్నారు. భారీ వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నందునా రైతులకు కిసాన్ కాంగ్రేస్ శ్రేణులు సహాయంగా నిలువాలని పిలుపునిస్తున్నామన్నారు.