Medak |
విధాత, మెదక్ బ్యూరో: రాష్ట్ర మంత్రి హరీష్ రావు అబద్ధపు హామీలకు నిరసనగా ఈనెల 14న మెదక్ బంద్‌కు పిలుపు నిచ్చామని, మెదక్ ప్రజలు సహకరించాలని వ్యాపార, వాణిజ్య, వర్గాలు పూర్తి బంద్ పాటించాలని పిసిసి కార్యదర్శి మ్యాడమ్ బాలకృష్ణ, పిసిసి ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు సుప్రభాత రావు, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి హఫెజోద్దిన్ మోల్సాబ్ లు పిలుపునిచ్చారు.
గుల్షన్ క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. అంతకు ముందు వ్యాపార, వాణిజ్య దుకాణాల్లో బంద్ పాటించాలని కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరులో రాష్ట్ర మంత్రి హరీష్ రావు అబద్ధపు హామీలు ఇచ్చారని అన్నారు.
హరీష్ రావు మెదక్‌పై వివక్షతకు వ్యతిరేకంగా ఈ బంద్ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సుప్రభాత రావు మాట్లాడుతూ.. హరీష్ రావు అధికార పోకడలకు మెదక్ ప్రజల ఆత్మ గౌరవానికి మద్య జరుగుతున్న పోరాటమే ఈనెల 14న జరిగే మెదక్ పట్టణ బంద్ అన్నారు.
ఈ బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. సిద్దిపేట, గజ్వేల్‌ను మాత్రమే మంత్రి హరీష్ రావు అభివృద్ది చేస్తారని వ్యాఖ్యానించడం గమనార్హం అన్నారు. ఇప్పటికైనా మెదక్ ప్రజలు గమనించాలన్నారు.
ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ అభివృద్ది విషయంలో పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మంగ మోహన్ గౌడ్, బాల్ రాజ్ గౌడ్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.