Eatela Rajender | కేసీఆర్ సర్కార్‌కు కాలం చెల్లింది: ఈటల

Eatela Rajender కేయూ విద్యార్థులకు పరామర్శ వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ విధాత, వరంగల్: అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలు అవలంభిస్తున్న కేసీఆర్ సర్కార్‌కు కాలం చెల్లిందని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. కేయూ పీహెచ్ డీ అడ్మిషన్ల వివాదంలో విద్యార్థి నాయకులు గాయపడిన విషయం తెలిసిందే. సోమవారం గాయపడిన విద్యార్థి నాయకులను యూనివర్సిటీ దీక్షా శిబిరంలో బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఈటల పరామర్శించారు. అనంతరం ఆయన […]

  • By: Somu    latest    Sep 11, 2023 12:09 AM IST
Eatela Rajender | కేసీఆర్ సర్కార్‌కు కాలం చెల్లింది: ఈటల

Eatela Rajender

  • కేయూ విద్యార్థులకు పరామర్శ
  • వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

విధాత, వరంగల్: అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలు అవలంభిస్తున్న కేసీఆర్ సర్కార్‌కు కాలం చెల్లిందని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. కేయూ పీహెచ్ డీ అడ్మిషన్ల వివాదంలో విద్యార్థి నాయకులు గాయపడిన విషయం తెలిసిందే.

సోమవారం గాయపడిన విద్యార్థి నాయకులను యూనివర్సిటీ దీక్షా శిబిరంలో బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఈటల పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరో మూడు నెలల కాల పరిమితి ముగిస్తే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపుతారని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగి వేసారి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వరంగల్‌లో ఒక దొర, ఎమ్మెల్సీ మోపైయిండని, ఆయన అండతో వీసీ విద్యార్థులతో పెట్టుకున్నారని విమర్శించారు.

యూనివర్సిటీ అన్నప్పుడు విద్యార్థులు, అధ్యాపకులతో వీసీకి సమస్యలు ఉంటాయని కానీ పోలీసుల జోక్యం చేసుకోవడం, వారిపై ఆధారపడడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షురా రావు పద్మ, ధర్మారావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, డాక్టర్లు విజయ రామారావు, విజయ చందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, కాళీప్రసాద్ పాల్గొన్నారు.