ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీ ముఖర్జీనగర్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
దీంతో తీవ్ర ఆందోళనకు గురైన విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు కిటీకిల్లో నుంచి తీగల సహాయంతో కిందకు దిగారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
#WATCH | People escape using wires as fire breaks out in a building located in Delhi’s Mukherjee Nagar; 11 fire tenders rushed to the site, rescue operation underway
(Source: Delhi Fire Department) pic.twitter.com/1AYVRojvxI
— ANI (@ANI) June 15, 2023
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. 11 ఫైరింజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పేశాయి.
ఎలక్ట్రిక్ మీటర్‌లో విద్యుత్ షాక్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.