Manipur | మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. ముగ్గురు దుర్మరణం

Manipur ఇప్పటి వరకు 120 మంది మృతి విధాత: మణిపూర్‌లో రెండు జాతుల మధ్య మొదలైన హింసాకాండ చెలరేగుతూనే ఉన్నది. తాజాగా గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. ఉబ్రూల్ జిల్లాలోని తోవాయి కుకి గ్రామంలో మంగళవారం ఉదయం సాయుధులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించారు. ఈ ఏడాది మూడో తేదీన రెండు జాతుల మధ్య చెలరేగిన అల్లర్లలో ఇప్పటివరకు 120 మంది దుర్మరణం చెందారు. సుమారు 3,000 […]

  • Publish Date - September 12, 2023 / 09:30 AM IST

Manipur

  • ఇప్పటి వరకు 120 మంది మృతి

విధాత: మణిపూర్‌లో రెండు జాతుల మధ్య మొదలైన హింసాకాండ చెలరేగుతూనే ఉన్నది. తాజాగా గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. ఉబ్రూల్ జిల్లాలోని తోవాయి కుకి గ్రామంలో మంగళవారం ఉదయం సాయుధులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించారు.

ఈ ఏడాది మూడో తేదీన రెండు జాతుల మధ్య చెలరేగిన అల్లర్లలో ఇప్పటివరకు 120 మంది దుర్మరణం చెందారు. సుమారు 3,000 మందికిపైగా గాయపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను తిరిగి పునరుద్ధరించేందుకు సుమారు 40,000 కేంద్ర భద్రతా బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. వీరికి అదనంగా రాష్ట్ర పోలీసులు బలగాలు భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నప్పటికీ హింసాకాండ కొనసాగుతూనే ఉన్నది.