Odisha
విధాత: జాతీయ రహదారులపై వాహనాలు వెళ్తుంటాయి. చేపలు పట్టడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా! ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ఒడిశాలోని భౌద్ జిల్లాలో కూడా భారీ వర్షాలకు అనేక చెరువు నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. ఆ వరద జాతీయ రహదారుల మీదుగా ప్రవహిస్తున్నది.
#WATCH | Odisha: Locals catch fish at the inundated National Highway 57 in the Boudh area after ponds of the fisheries department got flooded following heavy and continuous rainfall
Lipsa Pattnaik, District Fisheries Officer, Boudh says, ” Around two tonnes of fish washed away… pic.twitter.com/uM1x3h625U
— ANI (@ANI) August 2, 2023
చెరువుల్లో మత్స్యశాఖ పెంచుతున్న చేపలు వరదలో కొట్టుకురాగా జాతీయ రహదారిపై నిలబడి కట్టెతో కొట్టి బుట్టలో వేసుకొని వెళ్తున్నారు స్థానికులు. జాతీయ రహదారిపై చేపలు పట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వర్షాల మధ్య సుమారు 2,000 కిలోల చేపలు కొట్టుకుపోయాయని, సుమారు రూ.9 లక్షల నష్టం వాటిల్లిందని భౌధ్ జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు.