Rahul birthday | ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు.. క్షీరాభిషేకం చేసిన వీహెచ్‌

Rahul birthday | విధాత‌: రాష్ట్ర‌వ్యాప్తంగా ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ 53వ జ‌న్మ‌దినోత్స‌వాల‌ (Rahul birthday)ను రాష్ట్ర కాంగ్రెస్ ఘ‌నంగా నిర్వ‌హించింది. సోమ‌వారం ఉద‌యం గాంధీభ‌వ‌న్‌లో రాహుల్ చిత్ర‌ప‌టానికి మాజీ పీసీసీ అధ్య‌క్షులు ,సీనియ‌ర్ నేత వి. హ‌న్మంత‌రావు రాహుల్‌చిత్ర ప‌టానికి క్షీరాభిషేకం చేశారు. కేక్ క‌ట్ చేసి ,స్వీట్స్ పంచుకున్నారు. ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్య‌క్షులు బ‌ల్మూరి వెంక‌ట్ ఆ ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిభిరం నిర్వ‌హించ‌గా, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున‌ […]

Rahul birthday | ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు.. క్షీరాభిషేకం చేసిన వీహెచ్‌

Rahul birthday |

విధాత‌: రాష్ట్ర‌వ్యాప్తంగా ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ 53వ జ‌న్మ‌దినోత్స‌వాల‌ (Rahul birthday)ను రాష్ట్ర కాంగ్రెస్ ఘ‌నంగా నిర్వ‌హించింది. సోమ‌వారం ఉద‌యం గాంధీభ‌వ‌న్‌లో రాహుల్ చిత్ర‌ప‌టానికి మాజీ పీసీసీ అధ్య‌క్షులు ,సీనియ‌ర్ నేత వి. హ‌న్మంత‌రావు రాహుల్‌చిత్ర ప‌టానికి క్షీరాభిషేకం చేశారు. కేక్ క‌ట్ చేసి ,స్వీట్స్ పంచుకున్నారు.

ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్య‌క్షులు బ‌ల్మూరి వెంక‌ట్ ఆ ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిభిరం నిర్వ‌హించ‌గా, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున‌ ర‌క్త దానం చేశారు. హైద‌రాబాద్‌లో ప‌లు చోట్ల పార్టీ నాయ‌కులు కేక్‌లు క‌ట్ చేశారు.

జూబ్లీ హిల్స్‌లోని పెద్ద‌మ‌మ్మ గుడిలో ఏఐసీసీ ఇంచార్జీ మానిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ కార్య‌ద‌ర్శి రోహిత్ చౌద‌రి,మాజీ ఎమ్మెల్ల్యేలు విష్ణు, కోదండ రెడ్డి, నాయ‌కులు వేణుగోపాల్‌, నిరంజ‌న్ త‌దిత‌రులు రాహుల్ గాంధీ ఆయురారోగ్యాల‌తో క‌ల‌కాలం బాగుండాల‌ని ఆకాంక్షిస్తూ గుడికి వెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నేత‌లు రాహుల్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ప‌లు సామాజిక సేవ కార్య‌క్ర‌మాలు, పాలాభిషేకాలు, కేక్ క‌టింగ్‌లు చేశారు. ఆయా ఆసుప‌త్రుల్లో పాలు, పండ్లు పంపిణీ చేశారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో పుస్త‌కాలు, పెన్నులు పంపిణీ చేశారు.