Sucheetah |
విధాత: పెళ్లి వేడుకను ఘనంగా, గొప్పగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అంతే కాకుండా వివాహ వేడుకలో డ్రెస్సింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వధూవరులిద్దరూ మ్యాచింగ్ డ్రెస్ వేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆ విధంగా చూడముచ్చటగా కనిపించేలా రెడీ అయిపోతుంటారు.
ఆ మాదిరిగానే ఓ జంట మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని అందర్నీ మెస్మరైజ్ చేశారు. వధువు.. వరుడి వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆమె డ్రెస్సింగ్‌కు అతను ఫిదా అయిపోయాడు. ఆమె అందానికి మంత్ర ముగ్ధుడైపోయాడు. వధువు వేదికపైకి రాగానే తన చేతిని అందించి స్వాగతించాడు.
మీరు చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తూ స్టన్ అయిపోయాను. నేను మీకు ముద్దు ఇవ్వొచ్చా..? ఇంకేముంది.. తనకు కాబోయే వాడికి ఆమె ఓకే చెప్పేసింది. అలా నూతన వధూవరులిద్దరూ లిప్ కిస్ ఇచ్చుకుని తమ ప్రేమకు స్వాగతం పలికారు. మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఒక్కటయ్యారు. నూతన జంటకు శుభాకాంక్షలు వెలువెత్తాయి.