Jaipur | భరణం రూ.55 వేలను కోర్టు ముందు నాణాలుగా పోసిన భర్త.. జడ్జి ఆదేశాలతో షాక్
విధాత: భార్యకు ఇవ్వాల్సిన భరణం బాకీ రూ.55 వేలను రూపాయి, రెండు రూపాయలతో చెల్లిస్తానని గుట్టగా కోర్టులో పోసిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. అనంతరం జడ్జి ఇచ్చిన ఆదేశాలతో ఆ భర్తకు దిమ్మ తిరిగింది. జైపూర్ (Jaipur)లో వీధి వ్యాపారిగా ఉన్న దశరథ్‌కు 10 ఏళ్ల క్రితం వివాహమైంది, ఆ తర్వాత నాలుగేళ్లకే వారి మధ్య గొడవలు రావడంతో విడాకులు ఇవ్వాలని దశరథ్ కోర్టును ఆశ్రయించాడు. కాగా.. వారి అయిదేళ్ల కుమార్తె బాధ్యతను తండ్రికే ఇచ్చిన కోర్టు.. తుది […]

విధాత: భార్యకు ఇవ్వాల్సిన భరణం బాకీ రూ.55 వేలను రూపాయి, రెండు రూపాయలతో చెల్లిస్తానని గుట్టగా కోర్టులో పోసిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. అనంతరం జడ్జి ఇచ్చిన ఆదేశాలతో ఆ భర్తకు దిమ్మ తిరిగింది. జైపూర్ (Jaipur)లో వీధి వ్యాపారిగా ఉన్న దశరథ్‌కు 10 ఏళ్ల క్రితం వివాహమైంది, ఆ తర్వాత నాలుగేళ్లకే వారి మధ్య గొడవలు రావడంతో విడాకులు ఇవ్వాలని దశరథ్ కోర్టును ఆశ్రయించాడు.
కాగా.. వారి అయిదేళ్ల కుమార్తె బాధ్యతను తండ్రికే ఇచ్చిన కోర్టు.. తుది తీర్పు వచ్చే వరకు భార్యకు రూ.5 వేల భరణాన్ని ఇవ్వాలని ఆదేశించింది. అయితే గత 11 నెలలుగా ఈ మొత్తాన్ని దశరథ్ తన భార్యకు చెల్లించలేదు. దీంతో ఆవిడ కోర్టును ఆశ్రయించడంతో దశరథ్‌పై జడ్జి అరెస్టు వారెంట్ జారీ చేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి ఈ నెల 17న కోర్టులో ప్రవేశపెట్టారు.
తన వ్యాపారం దెబ్బతిన్నందు వల్లే భరణాన్ని చెల్లించలేక పోయానని భర్త చెప్పినప్పటికీ.. భరణాన్ని చెల్లించాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు. దీంతో అతడి బంధువులు, స్నేహితులు అప్పటికప్పుడు రూ.55 వేల మొత్తాన్ని రూపాయలు, రెండు రూపాయలుగా బస్తాలో తెచ్చి కోర్టుకు సమర్పించారు. ఈ పరిణామంపై భార్య తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాగా.. తమ క్లయింటును మానసికంగా క్షోభకు గురిచేయడానికే ఇలా చేస్తున్నారన్నాడు. వీటిని లెక్క పెట్టడానికే పది రోజులు పడుతుందని ఎంతో శారీరిక శ్రమ అవసరమని కోర్టుకు నివేదించాడు. దీనిపై దశరథ్ తరపు న్యాయవాది వాదిస్తూ.. తమ క్లయింటు వీధి వ్యాపారి కావడం వల్ల వినియోగదారులు చిల్లరలోనే చెల్లిస్తారని, ఈ నాణాలు చట్టబద్ధమైనవి కావడం వల్ల వీటిని స్వీకరించాలని కోరాడు.
ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి ఆ నాణాలను తీసుకోడానికి ఒప్పుకొంటూనే.. దశరథ్‌కు షాక్ ఇచ్చారు. ఈ నెల 27న వాదనలు జరిగే సమయానికి రూ.1000 చొప్పున 11 ప్యాకెట్లలో వాటిని లెక్కగట్టి కోర్టుకు ఇవ్వాలని దశరథ్‌ను ఆదేశించారు. ఇది మరీ కష్టంగా అనిపిస్తే ఎవరి సాయమైనా తీసుకోవచ్చని వెసులుబాటునూ ఇచ్చారు.