Jairam Ramesh | అజెండా ఆ ఇద్దరికే తెలుసు: జైరాం రమేశ్‌

Jairam Ramesh మండిపడిన కాంగ్రెస్‌ నేత జైరారమేశ్‌ ఇదేం ప్రజాస్వామ్యం? : డెరెక్‌ ఓ బ్రైన్‌ న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండాను రహస్యంగా ఉంచుతున్న కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ అజెండా ఏమిటో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలుసునని పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘ఈ రోజు సెప్టెంబర్‌ 13. ఐదు రోజుల పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ రోజు నుంచి ఐదు రోజుల్లో ప్రారంభం […]

  • Publish Date - September 13, 2023 / 01:40 PM IST

Jairam Ramesh

  • మండిపడిన కాంగ్రెస్‌ నేత జైరారమేశ్‌
  • ఇదేం ప్రజాస్వామ్యం? : డెరెక్‌ ఓ బ్రైన్‌

న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండాను రహస్యంగా ఉంచుతున్న కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ అజెండా ఏమిటో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలుసునని పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘ఈ రోజు సెప్టెంబర్‌ 13. ఐదు రోజుల పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ రోజు నుంచి ఐదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కానీ ఇప్పటి వరకూ ఒకే ఒక్కరికి.. బహుశా మరో వ్యక్తికి తప్ప ఇంకెవరికీ అజెండా ఏమిటో తెలియదు’ అని పేర్కొన్నారు.

గతంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినప్పుడు అజెండాను ముందు ప్రకటించిన సందర్భాలను జైరాం రమేశ్‌ ప్రస్తావించారు. 2019 నవంబర్‌ 26న సెంట్రల్‌ హాల్‌లో ప్రత్యేక సమావేశాలను రాజ్యాంగ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేశారని తెలిపారు. జీఎస్టీ ప్రారంభానికి సూచికగా 2017 జూన్‌ 30న అర్ధరాత్రి ప్రత్యేక సమావేశాలను సెంట్రల్‌ హాల్‌లో నిర్వహించారని ర్తుు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 2015 నవంబర్‌ 26, 27 తేదీల్లో ప్రత్యేక సమాశాలు నిర్వహించారని పేర్కొన్నారు.

రాజ్యసభ, లోక్‌సభ మొట్టమొదటిసారి సమావేశమై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2012 మే 13న ప్రత్యేక సమావేశం నిర్వహించారని తెలిపారు. సమావేశాల ప్రారంభానికి ఇంకా రెండు పనిదినాలే మిగిలి ఉన్నా ఇంత వరకూ అజెండా బయటపెట్టకపోవడాన్ని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ ఓ బ్రైన్‌ ఎక్స్‌లో ప్రస్తావించారు. ఇద్దరికి మాత్రమే అజెండా తెలుసన్న బ్రైన్‌.. అయినా ఇప్పటికీ మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని చెప్పుకొంటున్నామని వ్యాఖ్యానించారు