
- కాంగ్రెస్‌కు 69-72
- బీఆరెస్‌కు 36-39
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో మెజార్టీ సర్వేలు కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కుతుందని తేల్చాయి. తాజాగా తెలంగాణ లోక్‌పోల్ సంస్థ నిర్వహించిన ఫ్రీ పోల్ సర్వేలోనూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీకి అవసరమైన సీట్లు గెలుస్తుందని వెల్లడయ్యింది. హ్యాట్రిక్ విజయంపై ఆశలు పెట్టుకున్న అధికార బీఆరెస్ పార్టీకి నిరాశ తప్పదని సర్వే నివేదిక తెలిపింది. ఎన్నికల్లో అధికార బీఆరెస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యనే ముఖాముఖీ నెలకొందని సర్వే పేర్కోంది. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ మార్క్ 60సీట్ల కంటే అదనంగా 69-72 సీట్లు వస్తాయని లోక్‌పోల్ సంస్థ మెగా సర్వే వెల్లడించింది. అధికార బీఆరెస్ పార్టీకి 36-39సీట్లు, మిత్ర పక్షం ఎంఐఎంకు 5-6సీట్లు, బీజేపీకి 2-3సీట్లు, ఇతరులకు 1 సీటు దక్కవచ్చిని సర్వే వెల్లడించింది. అయితే ఈ సర్వే ఎప్పుడు...ఏ పద్దతిలో నిర్వహించారన్నదానిపై లోక్‌పోల్ స్పష్టతనివ్వలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 43% - 46% ఓట్లు, బీఆరెస్‌కు 38% - 41% ఓట్లు, ఎంఐఎంకు 3% - 4% ఓట్లు, బీజేపీకి 7% - 10% ఓట్లు, ఇతరులు 4% - 6% ఓట్లు సాధించవచ్చని సర్వే తెలిపింది.
ఇదే సంస్థ గతంలో నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌కు 61-67, బీఆర్ఎస్‌కు 45-51, ఎంఐఎంకు 6-8, బీజేపీకి 2-3, ఇతరులకు 0-1 స్థానాలు వస్తాయని వెల్లడించింది. తదుపరి కాంగ్రెస్‌కు 58 నుంచి 64, బీఆర్ఎస్ 47 నుంచి 53, ఎంఐఎం 5 నుంచి 7, బీజేపీ 2 నుంచి 3, ఇతరులకు 0-1 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తాజాగా నిర్వహించిన సర్వేలో అంతకుముందు సర్వేల్లో కంటే ఎక్కువగా కాంగ్రెస్‌కు మరిన్ని సీట్లు పెరుగనున్నట్లుగా పేర్కోనడం గమనార్హం.
