Medak | బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర గౌడ్..?

Medak బీజేపీలో సీఎం కెసిఆర్ కోవర్టులు… సంచలనం రేపిన నందీశ్వర వ్యాఖ్యలు… విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు, పటాన్ చెరువు నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీజేపీ రాష్ట్ర నాయకుడు నందీశ్వర్ గౌడ్ స్వంత పార్టీ నేతలు 4 గురు సీఎం కెసిఆర్ కు కోవర్టులుగా మారారని ఏకంగా ఒక న్యూస్ చానల్ లో మాట్లాడుతూ చెప్పడం సంచలనంగా మారింది. తాను పార్టీలో ఎవరి వర్గం కాదంటునే […]

Medak | బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర గౌడ్..?
  • Medak
  • బీజేపీలో సీఎం కెసిఆర్ కోవర్టులు…
  • సంచలనం రేపిన నందీశ్వర వ్యాఖ్యలు…

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు, పటాన్ చెరువు నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీజేపీ రాష్ట్ర నాయకుడు నందీశ్వర్ గౌడ్ స్వంత పార్టీ నేతలు 4 గురు సీఎం కెసిఆర్ కు కోవర్టులుగా మారారని ఏకంగా ఒక న్యూస్ చానల్ లో మాట్లాడుతూ చెప్పడం సంచలనంగా మారింది. తాను పార్టీలో ఎవరి వర్గం కాదంటునే విమర్శలకు దిగారు. దీంతో ఉమ్మడి జిల్లా బీజేపీ లో ఓ కుదుపెనని చెప్పాలి.

రాష్ట్ర స్థాయిలో నందీశ్వర్ గౌడ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. 4 గురు బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు సీఎం కెసిఆర్ కు కోవర్ట్ లుగా మారారని, వారి పేర్లు జాతీయ నేతలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానని నందీశ్వర గౌడ్ చెప్పడం…. స్వంత పార్టీలోనే మింగుడు పడటం లేదు. ఇటీవలనే మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్ల్లోళ్ళ శశిధర్ రెడ్డి బీజేపీ నుండి బయటకు వచ్చి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నందీశ్వర్ గౌడ్ సైతం బీజేపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే ఉన్నట్టు ఉండి గత 5 సంవత్సరాల నుండి బిజెపి కోసం నందీశ్వర్ గౌడ్ పనిచేస్తున్నారు. ఈయన మొదటి నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి దగ్గరగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాలలో మార్పుల కారణంగా నందీశ్వర గౌడ్ ఇలా మాట్లాడారా… బీజేపీలో ఎన్నడు లేనిది, మీడియా ముఖంగా పార్టీలోని 4 గురు వ్యక్తుల పేర్ల తో సహా పార్టీ ఇంఛార్జి తరుణ్ చుగ్, ఇతర నేతలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

ఫిర్యాదు చేసిన తరువాత మీడియాకు వెల్లడించడం బీజేపీలో సంచలనంగా మారింది. 2009లో పటాన్ చెరువు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన నందీశ్వర్ గౌడ్, తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరారు. నందీశ్వర్ గౌడ్ తిరిగి స్వంత పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం. బీజేపీలోనే కొనసాగుతానని నందీశ్వర ర్ గౌడ్ చెపుతున్న ప్పటికి.. రాజకీయ విశ్లేషకులు మాత్రం.. బీజేపీ కి త్వరలో నందీశ్వర్ గౌడ్ రాం రాం.. చెప్పన్నున్నట్లు తెలుస్తోంది.

పార్టీ అగ్రనాయకుల పై సీఎం కోవర్టులని ఫిర్యాదు చేసిన నందీశ్వర గౌడ్ పార్టీలో ఎలా నెగ్గ‌గలుగుతారని… పార్టీ నేతలే అంటున్నారు. 20 రోజుల్లో రాజకీయాలలో మార్పులు జరుగుతాయని నందేశ్వర్ గౌడ్ ప్రకటించడం రాజకీయాలలో… మరి ఉమ్మడి జిల్లా లో సంచలనంగా మారింది.