Nizamabad
విధాత, ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య నూతన గృహ ప్రవేశానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఒకేసారి ఇద్దరూ రావడంతో ఒకరినొకరు పలకరించుకున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత ఇరువురు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్లను ఎమ్మెల్సీ కవిత పరిచయం చేశారు.
జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్యకు ఎంపీ అరవింద్‌తో ప్రస్తుతం సఖ్యత కుదరడం లేదు. అయితే గతంలో ఎంపీ అరవింద్‌తో కలిసే బసవ లక్ష్మీ నరసయ్య బీజేపీలో చేరాడు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పదవి రావడానికి వెనుక ఎంపీ అరవింద్ అండదండలు ఉన్నాయి.
నిజామాబాద్ అర్బన్ నుండి ఇటు బసవ లక్ష్మీ నరసయ్య అటు ధనపాల్ సూర్యనారాయణ గుప్త ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఎంపీ అరవింద్ మాత్రం దన్ పాల్ సూర్యనారాయణకు మొగ్గు చూపుతున్నాడు.
దీంతో బసవ లక్ష్మీ నరసయ్య ఎంపీ అరవింద్‌కు వ్యతిరేక గ్రూప్ అయిన ఎండల లక్ష్మీనారాయణ, ఆర్మూర్ వినయ్ రెడ్డి, బాల్కొండ సునీల్ రెడ్డితో జతకట్టారు.