Nizamabad | కేసీఆర్.. నీ ప‌త‌నం మొద‌లైంది: సూర్య‌నారాయ‌ణ‌

Nizamabad విధాత ప్రతినిధి, నిజామాబాద్: కెసిఆర్ నీ పతనం మొదలైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అరెస్ట్ పై తీవ్రస్థాయిలో బిజెపి నేత దన్ పాల్ సూర్యనారాయణ ఫైర్ అయ్యారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో బిజెపి అర్బన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యం మీద పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర […]

  • Publish Date - July 20, 2023 / 12:30 AM IST

Nizamabad

విధాత ప్రతినిధి, నిజామాబాద్: కెసిఆర్ నీ పతనం మొదలైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అరెస్ట్ పై తీవ్రస్థాయిలో బిజెపి నేత దన్ పాల్ సూర్యనారాయణ ఫైర్ అయ్యారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో బిజెపి అర్బన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యం మీద పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. పేదలకు అందజేయాల్సిన డబుల్ బెడ్ రూమ్‌లను పరిశీలనకు పోతే ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎందుకు వణుకు పుడుతుందన్నారు.

పరిపాలనను మరిచి ఫామ్ హౌస్కు పరిమితమైన నిన్ను ప్రజలు బయటకు తీసుక వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కబ్జాల పరిపాలన నియంతృత్వ పరిపాలన తో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రిని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. శాంతియుతంగా వెళ్లిన మా అధ్యక్షుడిని అక్రమంగా ఈడ్చుకెళ్ళడం నీ మూర్ఖత్వపు పాలనకు నిదర్శనం ఎన్ని అరెస్టులు చేసినా ఎంతమందిని జైల్లో పెట్టిన నీ తాటాకు చప్పులకు భయపడేవారు కారన్నారు.

మీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలనకు చర్మ గీతం పాడాలన్నారు. నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయమంటేనే నీకు చేతకాకపోతే ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తావ్ అని ప్ర‌శ్నించారు.

ఆవాస్ యోజన కేంద్రం నిధులతో డబుల్ బెడ్ రూమ్లు కట్టి ఇవ్వాలని మంజూరు చేస్తే ఇప్పటికీ కట్టించిన పాపాన పోలేదన్నారు. తూతూ మంత్రంగా ఎన్నికల సమయంలో కొన్ని ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చామని చెప్పుకుంటున్న నిన్ను ప్రజలు తరిమికొట్ట‌డం ఖాయ‌మ‌ని తెలిపారు.