Pension | పెన్షన్‌పై కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కేంద్ర ఆర్థిక శాఖ
Pension | 40-45 శాతం మధ్య ఇస్తారని వార్తలు కమిటీ ఇంకా నిర్ణయానికి రాలేదన్న ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు కనీస పెన్షన్‌ను వారి చివరి శాలరీ బేసిక్‌పై 40 నుంచి 45 శాతం మధ్య ఇస్తుందని, ఈ మేరకు ప్రస్తుత మార్కెట్ లింక్డ్ పెన్షన్‌ను సవరిస్తుందని వార్తలు వచ్చినా.. వాటిలో వాస్తవం లేదని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొన్నది. ఈ విషయంలో ఒక కమిటీ ప్రస్తుతానికి చర్చలు జరుపుతున్నదని, స్టేక్‌హోల్డర్లతో సంప్రదింపులు జరిపే […]

Pension |
- 40-45 శాతం మధ్య ఇస్తారని వార్తలు
- కమిటీ ఇంకా నిర్ణయానికి రాలేదన్న ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు కనీస పెన్షన్‌ను వారి చివరి శాలరీ బేసిక్‌పై 40 నుంచి 45 శాతం మధ్య ఇస్తుందని, ఈ మేరకు ప్రస్తుత మార్కెట్ లింక్డ్ పెన్షన్‌ను సవరిస్తుందని వార్తలు వచ్చినా.. వాటిలో వాస్తవం లేదని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొన్నది.
ఈ విషయంలో ఒక కమిటీ ప్రస్తుతానికి చర్చలు జరుపుతున్నదని, స్టేక్‌హోల్డర్లతో సంప్రదింపులు జరిపే ప్రక్రియలో ఉన్నదని తెలిపింది. కమిటీ ఇంత వరకూ ఒక నిర్ధారణకు రాలేదని పేర్కొన్నది. పెన్షన్ వ్యవస్థను పునఃసమీక్షించేందుకు ఏప్రిల్‌లో ఒక కమిటీని నియమించారు. పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. మోదీ మూడోసారి గెలవాలని చూస్తున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ కమిటీని నియమించారు.