మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.కేక పెట్టించే అందం, అద్భుత‌మైన న‌ట‌న‌తో కుర్రాళ్ల‌కి గిలిగింత‌లు పెడుతుంటుంది. కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. తెలుగులో నాని గ్యాంగ్ లీడర్‌, శర్వానంద్‌తో శ్రీకారం సినిమాల్లో న‌టించి అల‌రించింది.


అయితే తెలుగులో ప్రియాంక న‌టించిన రెండు సినిమాలు కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద‌గా స‌క్సెస్ సాధించ‌ లేక‌పోయాయి. దీంతో ఈ అమ్మ‌డు త‌న అదృష్టం ప‌రీక్షించుకోవ‌డం కోసం చెన్నైకి షిఫ్ట్ అయింది. అక్క‌డ మంచి విజ‌యాలు ప్రియాంక‌ని ప‌ల‌క‌రించాయి. కోలీవుడ్ ఫస్ట్ మూవీ డాక్టర్‌.. వంద కోట్ల క్లబ్‌లో చేరటంతో ప్రియాంక దశ తిరిగింది అనే చెప్పాలి.
సూర్య జ‌త‌గా కూడా న‌టించే అవ‌కాశం ప్రియాంక‌కి ద‌క్కింది. ఈటీ చిత్రంలో సూర్య స‌ర‌స‌న ప్రియాంక క‌థానాయిక‌గా జ‌త క‌ట్ట‌డంతో ఈ చిత్రంతో కూడా అమ్మ‌డికి మంచి పేరు వ‌చ్చింది. ప్ర‌స్తుతం పాన్ ఇండియా చిత్రాల‌లో కూడా న‌టించే అవకాశం ద‌క్కించుకుంది ప్రియాంక‌..


రీసెంట్‌గా ఈ అమ్మ‌డు సాహో ఫేం సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టిస్లున్నది. తమిళ్ టాప్ స్టార్ విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న మూవీలోనూ ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. అదేవిధంగా ధనుష్‌తో ఓ సినిమా, శివ కార్తికేయన్‌తో ఓ చిత్రం చేస్తున్నది.ఇవే కాక ప‌లు మీడియం రేంజ్ హీరోల సినిమాల‌లో కూడా న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లైనా ఇన్నాళ్లు ఏ చిత్రంలోనూ ఇసుమంత గ్లామర్‌ షో చేయని ముద్దుగుమ్మ ఎట్టకేటకు అందాల ప్రదర్షనకు తెర లేపింది. నిదానంగా పెద్ద చిత్రాలలో అవకాశాలు తలుపుతట్టుతుండడంతో వాటిని కాపాడుకోవడం కోసం, పెంచుకోవడం కోసం ఈ అమ్మడు మడిని పక్కనబెట్టింది.తాజాగా ప్రియాంక త‌న స‌న్న‌ని న‌డుము అందాలు చూపిస్తూ కుర్ర‌కారుని బేజారు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. బ్యూటీ అందాలు భ‌లే బాగున్నాయిగా అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్, విజ‌య్ సినిమాల‌లో న‌టిస్తున్న ఈ అమ్మ‌డి దశ ఎలా తిరుగుతుందో చూడాలి.
Updated On
sn

sn

Next Story