Priyanka Gandhi | మండిపోతున్న ధరలు.. మోదీ కాన్వాయ్‌కు కోట్లు: ప్రియాంకగాంధీ
Priyanka Gandhi జైపూర్: దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశంలోకి దూసుకుపోతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాధ్రా అన్నారు. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేపట్టి నిలదీస్తున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇది అహంకార పూరిత ప్రభుత్వమని మండిపడ్డారు. राजस्थान की कांग्रेस सरकार महंगाई से राहत दिलाने के लिए कैंप लगाकर जनता की मदद कर रही है। राजस्थान ने देश […]

Priyanka Gandhi
జైపూర్: దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశంలోకి దూసుకుపోతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాధ్రా అన్నారు. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేపట్టి నిలదీస్తున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇది అహంకార పూరిత ప్రభుత్వమని మండిపడ్డారు.
राजस्थान की कांग्रेस सरकार महंगाई से राहत दिलाने के लिए कैंप लगाकर जनता की मदद कर रही है। राजस्थान ने देश में पहली बार स्वास्थ्य का अधिकार लागू किया है। न्यूनतम आय गारंटी कानून, 8 रू में भरपेट भोजन देने वाली इंदिरा रसोई, गिग वर्कर्स एक्ट, शहरी रोजगार गांरटी योजना और स्मार्टफोन… pic.twitter.com/GhxrvXISWE
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 11, 2023
సోమవారం ఆమె రాజస్థాన్‌లోని టోంక్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. ధరలను నియంత్రించలేదని ప్రభుత్వం.. ధనవంతుల మేలు కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నదని ఆరోపించారు. మోదీ భూమి పుత్రుడని బీజేపీ చెబుతుంటే.. ఆ మోదీ కోట్లమంది భూమి పుత్రులకు భారంగా ఉన్న అధిక ధరలను తగ్గించాల్సింది పోయి.. తన రక్షణ కాన్వాయ్‌కి మాత్రం కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని ఆరోపించారు