Rahul Gandhi | ‘ఇంటి’వాడైన రాహుల్‌గాంధీ

Rahul Gandhi 12 తుగ్లక్‌ లేన్‌ బంగ్లా మళ్లీ కేటాయింపు న్యూఢిల్లీ: ఢిల్లీలోని తుగ్లక్‌ లేన్‌లో ఉన్న 12వ నంబరు బంగళాను కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్‌గాంధీకి ప్రభుత్వం కేటాయించింది. అనర్హత కేసులో సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో పార్లమెంటు సెక్రటేరియట్‌ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీకి లభించే బంగళా కూడా మంగళవారం కేటాయించారు. అనర్హత వేటు పడిన అనంతరం ఆయన ఇదే బంగళాను ఖాళీ చేయాల్సి వచ్చింది. అధికారిక నివాసం […]

Rahul Gandhi | ‘ఇంటి’వాడైన రాహుల్‌గాంధీ

Rahul Gandhi

  • 12 తుగ్లక్‌ లేన్‌ బంగ్లా మళ్లీ కేటాయింపు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తుగ్లక్‌ లేన్‌లో ఉన్న 12వ నంబరు బంగళాను కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్‌గాంధీకి ప్రభుత్వం కేటాయించింది. అనర్హత కేసులో సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో పార్లమెంటు సెక్రటేరియట్‌ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీకి లభించే బంగళా కూడా మంగళవారం కేటాయించారు.

అనర్హత వేటు పడిన అనంతరం ఆయన ఇదే బంగళాను ఖాళీ చేయాల్సి వచ్చింది. అధికారిక నివాసం మళ్లీ కేటాయించిన అంశంపై రాహుల్‌ ఒక వార్తా సంస్థతో స్పందిస్తూ.. మేరా ఘర్‌ పూరా హిందూస్థాన్‌ హై (మొత్తం భారతదేశం నా ఇల్లు) అన్నారు. 2004లో అమేథీ నుంచి గెలిచిన తర్వాత ఆయనకు ఈ బంగళా కేటాయించారు. అప్పటి నుంచి ఆయన అందులోనే ఉంటూ వచ్చారు.