Rahul Gandhi | bjp, ఆరెస్సెస్‌కు అధికారమే పరమావధి: రాహుల్‌గాంధీ

Rahul Gandhi న్యూఢిల్లీ: బీజేపీ-ఆరెస్సెస్‌కు అధికారమే పరమావధి అని, అధికారం తప్ప వాటికి దేశ ప్రజల ఈతిబాధలు పట్టవని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. గురువారం యూత్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో వర్చువల్‌గా మాట్లాడిన రాహుల్‌.. అధికారం కోసం బీజేపీ-ఆరెస్సెస్‌ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అధికారం కోసం వారు మణిపూర్‌ను తగులబెడతారు. మొత్తం దేశాన్ని తగులబెడతారు. వారికి దేశం భాధ, విషాదం పట్టదు. అది హర్యానా కావచ్చు, పంజాబ్‌ కావచ్చు లేదా ఉత్తరప్రదేశ్‌ కావచ్చు.. దేశం […]

  • By: krs    latest    Jul 27, 2023 2:07 PM IST
Rahul Gandhi | bjp, ఆరెస్సెస్‌కు అధికారమే పరమావధి: రాహుల్‌గాంధీ

Rahul Gandhi

న్యూఢిల్లీ: బీజేపీ-ఆరెస్సెస్‌కు అధికారమే పరమావధి అని, అధికారం తప్ప వాటికి దేశ ప్రజల ఈతిబాధలు పట్టవని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. గురువారం యూత్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో వర్చువల్‌గా మాట్లాడిన రాహుల్‌.. అధికారం కోసం బీజేపీ-ఆరెస్సెస్‌ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అధికారం కోసం వారు మణిపూర్‌ను తగులబెడతారు. మొత్తం దేశాన్ని తగులబెడతారు. వారికి దేశం భాధ, విషాదం పట్టదు. అది హర్యానా కావచ్చు, పంజాబ్‌ కావచ్చు లేదా ఉత్తరప్రదేశ్‌ కావచ్చు.. దేశం మొత్తాన్ని అధికారం కోసం వారు అమ్మేస్తారు’ అని దుయ్యబట్టారు.

దానిపైనే కాంగ్రెస్‌ పోరాడుతున్నదని చెప్పారు. ఒకవైపు దేశం పట్ల ప్రేమ ఒలకబోస్తారు. దేశ ప్రజలు ఇబ్బంది పడినా, బాధలకు గురైనా.. ముఖం నిండా విషాదం పులుముకుంటారు. కానీ.. నిజానికి వారి హృదయాల్లో మాత్రం ఎలాంటి భావనలు ఉండవు. ఆరెస్సెస్‌-బీజేపీ ఎలాంటి బాధను అనుభవించవు. ఎందుకంటే దేశాన్ని చీల్చడం కోసమే అవి పనిచేస్తున్నాయి కాబట్టి’ అని రాహుల్‌ అన్నారు. రాహుల్‌గాంధీ ప్రసంగంలోని కొన్ని భాగాలను కాంగ్రెస్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.