Sowarin Gold Bonds
విధాత: ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో రెండు దశలుగా సోవరిన్ గోల్డ్ బాండ్స్ (sovereign gold bonds) విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 19 నుంచి 23 వరకు మొదటి విడత బాండ్లకు సబ్ స్క్రైబ్ అయ్యేందుకు అవకాశం ఉండగా.. రెండో విడత బాండ్‌లకు సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు అవకాశం కల్పించనున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న సోవరిన్ గోల్డ్ బాండ్ వేలంలో గ్రాము బంగారం ప్రారంభ ధరను రు. 5926 గా నిర్ణయించారు. అయితే తుది విలువ మనం బాండ్ కొనే మూడు రోజుల మార్కెట్ తీరుపై ఆధారపడి ఉంటుంది ఆన్లైన్ లో ప్రక్రియను పూర్తి చేసేవారికి రు.50ల డిస్కౌంట్ లభిస్తుంది.
బంగారం పై పెట్టుబడులలో ఎస్ జీ బీలకు ప్రముఖ స్థానం ఉంది. మూల ధనం పై పెరుగుదలతో పాటు లాభాలపై సైతం 2.5 శాతం వడ్డీ వస్తుంది. ఎనిమిది ఏళ్ల పైబడి పెట్టుబడి కొనసాగిస్తే మూలధనంపై వచ్చే లాభాలకు పన్ను ఉండకపోవడం విశేషం.